JR NTR: జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు క‌రోనా నెగెటివ్‌.. ఫ్యాన్స్‌లో వెల్లువెత్తిన ఆనందం

కరోనా మహమ్మారి శరవేంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ వేరియంట్‌కు అత్యంత వేగంగా సంక్రమించే లక్షణముండడంతో ఇది ప్రతి ఒక్కరినీ తాకుతోంది. గత కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా, ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.ఎవరూ కంగారు పడవల్సిన అవసరం లేదని..ప్రస్తుతం బాగానే ఉన్నానని తారక్ స్పష్టం చేశారు. రంజాన్ స‌మ‌యంలో శుభాకాంక్ష‌లు తెలిపిన ఎన్టీఆర్ త‌న‌కు త్వ‌ర‌లోనే నెగెటివ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ కి తమిళనాడులో క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి – జల్లికట్టులో ‘జూనియర్’ ఫొటోలు..
 

తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా, ఆ ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు పేర్కొన్నాడు. త‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని చెప్ప‌డానికి సంతోషంగా ఉంద‌ని తెలియ‌జేసిన ఎన్టీఆర్ క‌రోనా స‌మ‌యంలో త‌న ఆరోగ్యంపై జాగ్ర‌త్తలు తీసుకున్న కిమ్స్ హాస్పిట‌ల్‌కు చెందిన‌ డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుల‌క‌ర్ణి, మా క‌జిన్ డాక్ట‌ర్ వీరు, టెనెట్ డ‌యాగ్నిస్టిక్స్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. అలానే త‌న ఆరోగ్యం కోసం ప్రార్దించిన వారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఎన్టీఆర్. అయితే కోవిడ్‌ను మ‌నం సీరియ‌స్‌గానే పరిగ‌ణించాలి. కోవిడ్ వ‌చ్చిన వారు అధైర్య‌ప‌డ‌వ‌ద్దు . పాజిటివ్ మైండ్‌తో ఉంటూ ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే క‌రోనాను త‌రిమికొట్ట‌వ‌చ్చని జూనియ‌ర్ అన్నారు.