Astrologer Venu Swamy : త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టరే.. వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..!
NQ Staff - March 17, 2023 / 12:30 PM IST

Astrologer Venu Swamy : త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఇప్పుడు హాలీవుడ్ మాట్లాడుకుంటోంది. ఆస్కార్ దెబ్బతో ఈ మూవీ పేరు, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేర్లు మార్మోగుతున్నాయి. ఇంత గొప్ప స్థాయికి వెళ్తుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది త్రిబుల్ ఆర్ మూవీ టీమ్.
ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డారు వారంతా కూడా. అయితే మొదటి నుంచి ఈ మూవీలో ఎన్టీఆర్ ది సైడ్ పాత్ర అంటూ చాలామంది నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా అన్న వారందరిపై ఫైర్ అవుతున్నారు. కానీ రాజమౌళి, రామ్ చరణ్ లు మాత్రం ఇద్దరూ సమానమే అంటూ చెబుతున్నారు.
రిపోర్టర్ కూడా..
ఇక రీసెంట్ గా హాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తున్న సమయంలో కూడా ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అంటూ ఓ రిపోర్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను ఆడేసుకున్నారు. ఇక తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టరే అంటూ చెప్పాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంకేముంది వేణుస్వామి మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మా హీరోను సైడ్ క్యారెక్టర్ అంటావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వేణుస్వామి మీద పోస్టులు పెడుతున్నారు యంగ్ టైగర్ అభిమానులు.