Jeevitha: ఓటు వేసేందుకు రాన‌ని చెప్పిన ఎన్టీఆర్.. కార‌ణం ఏంటో చెప్పిన జీవిత‌

Jeevitha: మా ఎల‌క్ష‌న్స్‌లో భాగంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఒక‌రిపై ఒక‌రు దారుణంగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఒక‌ర‌కంగా ఈ ఎల‌క్ష‌న్స్ వ‌ల‌న వారు త‌మ ప‌రువు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే మీడియా ముఖంగా ప‌లువురు స‌భ్యులు మాట్లాడుతున్న క్ర‌మంలో సోమవారం ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి జాయింట్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడారు.

Jr NTR Expressed Despair Over 'MAA Elections': Jeevitha
Jr NTR Expressed Despair Over ‘MAA Elections’: Jeevitha

నరేష్‌ టార్గెట్‌గా ఆమె స్పీచ్‌ సాగింది. నరేష్‌ వల్లే `మా`లో చేపట్టాల్సిన పనిలు ఆగిపోయాయని తెలిపారు. తాము పనులు చేసేందుకు ముందుకు వస్తే నరేష్‌ అడ్డుకున్నారని తెలిపారు. గతేడాది `మా` డైరీ ఆవిష్కరణ సమయంలో నరేష్‌తో విభేదాలు తలెత్తాయని తెలిపారు. `నరేష్‌పై నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆ మధ్యే ఓ 16 మంది నరేష్‌పై అనేక ఆరోపణలు చేశారు. వారితోనే మీటింగ్‌ పెడదామనుకున్నామని తెలిపింది.

`మా`కి సంబంధించిన పనులు చేయాలని ముందుకు వస్తే సంతకాలు పెట్టేందుకు ముందుకురాలేదని తెలిపారు. గత రెండేళ్లలో ఈసీ మీటింగ్‌ పెట్టేవారు కాదని, ఒకవేళ పెట్టినా ఆయన మీటింగ్‌ కి వచ్చి మాట్లాడేవారు కాదని ఆరోపించింది. `మా` సభ్యుల కోసం ఇళ్లు నిర్మించేందుకు ప్లాన్‌ చేశామని, దరఖాస్తు చేసేందుకు సంతకాలు పెట్టరని, ఎలాంటి సపోర్ట్ చేయరని తెలిపింది.

`మా` ఎన్నికలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలని కోరుకున్నామని, కానీ నరేష్‌ చేసిన కామెంట్లతో తాను స్పందించాల్సి వస్తుందని తెలిపింది జీవిత. మా సత్తాతోనే ఎన్నికల్లో గెలుస్తామని, `మా` ఎన్నికల్లో తమదే విజయమని పేర్కొంది జీవిత. ఇక `మా` ఎన్నికలపై జూ.ఎన్టీఆర్‌ని కలిసినప్పుడు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని, ఓటు వేసేందుకు రాను ఆయన చెప్పారని, `మా`లో జరుగుతున్నది చూస్తే బాధగా ఉందని ఎన్టీఆర్‌ చెప్పినట్టు జీవిత స్ప‌ష్టం చేసింది.