NTR : ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ వేసుకున్న హుడీ ఎన్ని లక్షలో తెలుసా..?
NQ Staff - March 19, 2023 / 07:38 PM IST

NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కాస్ట్యూమ్స్ అన్నా, లగ్జరీ వాచ్ లు అన్నా ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఆయన పెట్టకునే వాచ్ లు కోట్ల విలువ చేసేవి ఉంటాయి. అలాగే దుస్తులు కూడా లక్షల్లో ఉంటాయి. ఆయన ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ ఫ్యాషనబుల్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఆయన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో విశ్వక్ సేన్ పెద్ద అభిమాని. ఎన్టీఆర్ సపోర్ట్ కోసం ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ కోసం ఎన్టీఆర్ కదిలి వచ్చాడు. అయితే ఈవెంట్ కు ఆయన ఓ హుడీ వేసుకుని వచ్చాడు.
బ్లాక్ కలర్ హుడీ మీద వైట్ కలర్ మంటలు చెలరేగుతున్నట్టు గ్రాఫిక్స్ ప్రింట్ ఉంది. ఇది బ్లాక్- ఆరెంజ్ కాంబో కలర్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ హుడీ ధర ఎంతని గూగుల్ ను అడిగితే.. 170 యూరోస్ కి అందుబాటులో ఉంది. అంటే దాదాపుగా మన కరెన్సీలో రూ.15 వేలు వరకు ఉంటుంది.
ఎన్టీఆర్ రేంజ్ కు ఇది చాలా తక్కువే అయినా.. సామాన్య జనాలకు మాత్రం ఇది పెద్దదిగానే కనిపిస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తోంది.