Jr NTR And Ram Charan : సింగర్ తో క్షమాపణలు చెప్పించిన ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్

NQ Staff - March 17, 2023 / 07:50 PM IST

Jr NTR And Ram Charan : సింగర్ తో క్షమాపణలు చెప్పించిన ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్

Jr NTR And Ram Charan  : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా ఆస్కార్‌ అవార్డ్‌ రావడం పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన ప్రవర్తిస్తూ ఉన్నారు. సింగర్‌ కాల భైరవ ను తాజాగా రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అంటూ కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలు విషయం ఏంటీ అంటే ఆస్కార్‌ వేదికపై కాల భైరవ నాటు నాటు పాటను రాహుల్‌ సిప్లిగంజ్ తో పాడిన విషయం తెల్సిందే. దాంతో ఆయన స్థాయి అమాంతం పెరిగింది. దాంతో తనకు ఇంతటి అవకాశం దక్కేలా చేసిన రాజమౌళి మరియు కీరవాణి ఇతర కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ పెట్టాడు.

ఆయన పోస్ట్‌ లో ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లను ప్రస్తావించక పోవడంతో కాల భైరవ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కాల భైరవ పై తీవ్ర స్థాయిలో కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా తప్పక క్షమాపణలు చెప్పాడు. రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కు కాల భైరవ క్షమాపణలు చెప్పాడు.

నాటు నాటుకు ఆస్కార్‌ అవార్డ్‌ రావడంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ అన్నల పాత్ర అత్యంత కీలకం అన్నట్లుగా పోస్ట్‌ పెట్టాడు. తన పోస్ట్‌ ను తప్పుగా అర్థం చేసుకుని కొందరు విమర్శిస్తున్నారు అంటూ కాల భైరవ కొత్త పోస్ట్‌ లో పేర్కొన్నాడు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us