Jordar Sujatha: వ్యవహారం ‘జోర్దార్’గా ఉందే.. కొత్త కారుతో సుజాత రచ్చ

Jordar Sujatha బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరూ కూడా మంచి ఫాంలో ఉన్నారు. దాదాపు ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌కు గుర్తింపు వచ్చింది. అందరూ కూడా ఫేమస్ అయ్యారు. అందరికీ అవకాశాలు వస్తున్నాయి. కొందరు ఏకంగా హీరో, హీరోయిన్లు అయ్యారు. ఇంకొందరు బుల్లితెర పై మంచి అవకాశాలు సంపాదించుకున్నారు. ఇక అందరూ మంచిగానే సెటిల్ అవుతున్నారు. కొత్తిళ్లు, కొత్త కార్లు, బైకులు కొనుక్కుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

హైద్రాబాద్‌లోనే మోనాల్ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక అఖిల్ ఓ కొత్త కారును కొనుక్కున్నాడు. 25 ఏళ్ల లోపు సొంత కారును కొనాలనే తన కల నెరవేరిందంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ మధ్యే ఓ బైక్‌ను కొన్నాడు. ఇలా అందరూ కూడా తమ తమ రేంజ్‌లో అందరూ సెటిల్ అయ్యారు. ఇక తాజాగా జోర్దార్ సుజాత కూడా ఓ శుభవార్త చెప్పింది. తాను తన కలను నెర వేర్చుకున్నట్టు ప్రకటించింది.

వ్యవహారం ‘జోర్దార్’గా ఉందే.. కొత్త కారుతో సుజాత రచ్చ

తనకెంతో ఇష్టమైన కారు.. కలలు కన్న కారును సొంతం చేసుకున్నానని చెప్పుకొచ్చింది. కొత్త కారును కొన్నానంటూ చెబుతూ.. సుజాత గాల్లో తేలిపోయింది. బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా మధ్యలోనే ఎలిమినేట్ అయినా కూడా మంచి పేరునే సంపాదించుకుంది. అభిజిత్ విషయంలో సుజాత కొన్ని సార్లు నెగెటివిటీని మూట గట్టుకుంది. చివరకు అన్నయ్య అంటూ వివాదాన్ని మరో మలుపు తిప్పేసిన సంగతి తెలిసిందే. ఇంట్లో కూడా అలానే పిలిచే దాన్ని అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.