Varun Tej And Lavanya Tripathi : నాగబాబుకు షాక్ ఇచ్చిన అల్లుడు.. వరుణ్ ఎంగేజ్ మెంట్ కు రాని చైతన్య..!
NQ Staff - June 10, 2023 / 08:49 AM IST

Varun Tej And Lavanya Tripathi : కొన్ని నెలలుగా నిహారిక విడాకుల వార్తలు బాగా వైరల్ అవుతున్నారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. కానీ విడాకులు తీసుకున్నారా లేదా అనేది తెలియదు. కాకపోతే ఎవరి దారుల్లో వారు సాగుతున్నారు. కొన్ని నెలల క్రితం జొన్నలగడ్డ చైతన్య తన ఇన్ స్టా నుంచి నిహారిక పెండ్లి ఫొటోలను డిలీట్ చేశాడు.
కానీ నిహారిక మాత్రం దీనిపై స్పందించలేదు. పైగా అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించట్లేదు. ఇటు నిహారిక వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా మారిపోయింది. అటు చైతన్య ఎక్కడ ఉంటున్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఘటన ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని ప్రూవ్ చేసింది.
నిన్న వరుణ్ తేజ్-లావణ్య ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కానీ ఇంటి అల్లుడు మాత్రం రాలేదు. నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య రాకపోవడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు బలం చేకూరుతోంది. దీన్ని బట్టి ఇద్దరి నడుమ గ్యాప్ వచ్చింది నిజమే అంటున్నారు నెటిజన్లు.
ఒకవేల విబేధాలు లేకపోతే ఎంగేజ్ మెంట్ కు వచ్చేవాడు కదా. అంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే ఇంటి అల్లుడు రాకుండా ఉంటాడా.. కానీ గొడవలు జరిగాయి కాబట్టే ఆయన రాలేదని అర్థం అవుతోంది. మరి నిహారిక తన భర్తతో నిజంగానే విడిపోతుందా లేకపోతే తర్వాత రోజుల్లో కలిసి ఉంటుందా అనేది చూడాలి.