John Abraham : సెల్ఫీలు తీసుకున్న అభిమానులు.. ఫోన్ లాక్కున్న హీరో

John Abraham : హీరోలు క‌నిపిస్తే చాలు అభిమానులు ఎగ‌బ‌డి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని సంద‌ర్భంలో చిరాకు వ‌చ్చి ఫోన్ లాక్కోవ‌డం మ‌నం చూస్తుంటాం. ఆ మ‌ధ్య బాల‌కృష్ణ ఇలా ఫోన్ లాక్కొని కింద ఎత్తేశాడు కూడా. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహం తన స్నేహితుడితో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్‌ చేస్తున్నారు.

TheNewsQube-
John Abraham Snatches fans phone
John Abraham Snatches fans phone

అంతలోనే జాన్‌ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్‌ లాక్కున్నాడు. ఆ వెంటనే ఆ ఇద్దరు అభిమానులు జాన్ ని అనుసరించి ఫోన్ తీసుకున్నారు. ఈ సరదా సన్నివేశం వీడియోని జాన్ అబ్రహం ఇన్ స్టాలో షేర్ చేసారు. దీంతో ఇన్ స్టాలో ఇది వైరల్ గా మారింది. పెద్ద స్టార్ ఫ్యాన్స్ తో ఇలా సరదాగా మూవ్ అవ్వడంపై నెటి జనులు ఫిదా అయిపోతున్నారు.

క్రేజున్న పెద్ద స్టార్ అయినా ఎంత మాత్రం గర్వం అనేది చూపించకుండా ఓ ప్రెండ్ లా మూవ్ అవ్వడం అతని డౌన్ టు ఎర్త్ స్వభావానికి నిదర్శనంగా అభిమానులు పొగిడేస్తున్నారు. ఇక జాన్ అబ్రహాం సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు `సత్యమేవ జయతే-2`లో నటిస్తున్నాడు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 25న రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాల్ని పెంచింది. ఇందులో దివ్యాఖోస్లా కుమార్ హీరోయిన్ గా నటించింది. మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జాన్ అబ్రహం నటించిన `ముంబైసాగా` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కండరగండరుడిగా మంచి ఫాలోయింగ్ ఉంది. జాన్ కి యువతరంలో ఫుల్ క్రేజ్ ఉంది. గాళ్స్ లోనూ అసాధారణమైన ఫాలోయింగ్ ని కలిగిన స్టార్ అతడు.