JHANSI: క‌రోనాను ద్వేషించిన‌ యాంక‌ర్ ఝాన్సీ.. ఎందుకో తెలుసా?

JHANSI ఎవ‌రు ఊహించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రి జీవితాల‌ని అస్త‌వ్య‌స్థం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కరోనా వ‌ల‌న ప్ర‌పంచం మొత్తం స్తంభించినంత ప‌ని అవుతుంది. క‌రోనాకు భ‌య‌ప‌డి చాలా మంది త‌మ పనులు మానేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు. త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల‌లో వేడుక‌ల‌ను సాదాసీదాగా జ‌రుపుకుంటున్నారు. తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్ ఝాన్సీకు కొడుకు వ‌రుసైన వ్య‌క్తికి నిశ్చితార్థం జ‌రిగింది. క‌రోనా వ‌ల‌న ఈ వేడుక‌కు ఝాన్సీ హాజ‌రు కాలేక‌పోయింది. లైవ్‌లో వీక్షించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తడంతో కరోనాను తిట్టుకుంద‌ట ఈ యాంక‌ర్.

కోవిడ్‌ను చాలా మంది ప‌లు కారణాల వ‌ల‌న ద్వేషిస్తున్నారు.నేను అస‌హ్యించుకున్నాను. నా కొడుకు స‌మానుడైన వ్య‌క్తికి నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, కోవిడ్ వ‌ల‌న వెళ్లలేక‌పోయాను. ఆన్‌లైన్‌లోనే ఈ వేడుక చూడాల్సి వ‌చ్చింది. కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే నిశ్చితార్థ వేడుకకు హాజ‌రయ్యారు. ఈ వేడుక‌కు ముందు అంద‌రు క‌రోనా పరీక్ష చేయించుకోగా, నెగెటివ్ అని తేలింది. నాతో సహా 300 మంది ఈ ఎంగేజ్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఇది కాస్త క‌ష్ట‌మే అయిన త‌ప్ప‌డం లేదంటూ ఝాన్సీ త‌న ఇన్‌స్టా వీడియోలో నిశ్చాతార్థ‌పు ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ పేర్కొంది.

Advertisement