Jeevitha: టిక్కెట్ లేకుండా బ‌స్సు ప్ర‌యాణం చేసిన జీవిత‌.. త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?

Jeevitha: సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ఏ విష‌య‌మైన అభిమానుల‌కి ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. అందుకే ప‌లు ఛానెల్స్ వారు లేదంటే పేప‌ర్ వారు వారి ద‌గ్గ‌ర నుండి ఇంట‌ర్వ్యూ పేరుతో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను రాబ‌డుతూ ఉంటారు. రీసెంట్‌గా జీవిత రాజ‌శేఖ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూ ఇస్తూ గ‌తంలో జ‌రిగిన కొన్ని ఫ‌న్నీ ఇన్సిడెంట్స్‌ని పంచుకుంది. ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వచ్చి దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జీవిత.

హీరోయిన్‌గా జీవిత అద్భుత‌మైన సినిమాలు చేసింది. పెళ్లి త‌ర్వాత కాస్త త‌గ్గించిన ఈమె పిల్ల‌లు పుట్టాక పూర్తిగా న‌టించ‌డం మానేసింది. సినిమాల‌కు దూర‌మైన కూడా సినిమా ఇండ‌స్ట్రీకి ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది జీవిత‌. ఇప్పుడు ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ వ‌రుస సినిమాలు చేస్తుండ‌గా కూతుళ్లు శివానీ, శివాత్మిక‌లు క‌థానాయిక‌లుగా అల‌రిస్తున్నారు. ఇద్ద‌రు వైవిధ్య‌మైన ప్రాజెక్టుల‌లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

జీవిత ప్రొఫెష‌న‌ల్‌లైఫ్ గురించి చాలా మందికి అవ‌గాహ‌న ఉంది. కాని ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు ఇప్పటికీ కొన్ని సీక్రెట్‌గానే ఉన్నాయి. పెళ్లి కాక ముందు ఈమె జీవితంలో జరిగిన ఓ చేదు జ్ఞాపకం గురించి అభిమానులతో పంచుకుంది జీవిత. కాలేజ్‌కు వెళ్లే రోజుల్లో జరిగిన సంఘటన గురించి తాజ‌గా చెప్పారు జీవిత. కాలేజ్ రోజుల్లో రోజూ బస్సులోనే వెళ్లొచ్చేది ఈమె. అప్పుడు జీవితకు పాస్ ఉండేది. ఓసారి పాస్ అయిపోయినా కూడా రెన్యువల్ చేయించుకోవడం మరిచిపోయింది.

అయితే పాస్ వ్యాలిడిటీ ఉందేమో అనుకున్న జీవిత కండ‌క్ట‌ర్ అడ‌గ్గానే పాస్ అని వ్యాలిడిటీ అయిపోయిన పాస్ చూపించింది. దాంతో కండ‌క్ట‌ర్ ఇదేంట‌ని అడ‌గ‌గా, అప్పుడు అంద‌రు త‌న‌ను చూసి న‌వ్వార‌ని గుర్తు చేసుకుంది. కండక్టర్ టికెట్ తీసుకొమని తొందర పెడితే.. తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేవని చెప్పుకొచ్చింది జీవిత. అప్పుడు బస్సులోంచి దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో తన తండ్రి స్నేహితుడు ఒకరు బస్సులో జరిగినదంతా చూసి టికెట్ తీసుకొని తనను రక్షించారని చెప్పింది జీవిత.

ఆ అనుభవం త‌ర్వాత జీవిత ఎక్క‌డికి వెళ్లినా కూడా చేతిలో కొంత డ‌బ్బు త‌ప్ప‌క ఉంచుకుంటుంద‌ట‌. జీవిత ఇటీవ‌ల మా ఎన్నిక‌ల‌లో అధ్యక్షురాలిగా పోటీ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.అధ్య‌క్ష ప‌దవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ‌, న‌రిసింహారావు పోటీ ప‌డుతుండ‌గా వారితో బ‌రిలో నిలిచేందుకు జీవిత కూడా సిద్ధ‌మైంది.