Jeevitha Rajasekhar : హీరోయిన్లు కమిట్ మెంట్లు ఇస్తే మోసం ఎలా అవుతుంది.. జీవిత సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - June 15, 2023 / 11:42 AM IST

Jeevitha Rajasekhar : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అప్పట్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. కాగా కాస్టింగ్ కౌచ్ అరోపణలపై కొందరు ఫిర్యాదు చేసిన వారికి సపోర్టు చేస్తే.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీ వైపు మాట్లాడారు. ఒక్కొక్కరి వాదన ఒక్కో విధంగా ఉండేది అప్పట్లో. ఇప్పటికీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.
తాజాగా జీవిత రాజశేఖర్ ఈ విషయంపై మరోసారి ఫైర్ అయింది. గతంలో ఆమె మా అసోసియేషన్ లో కీలక పదవిలో ఉంది. మొన్న కూడా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. అయినా సరే ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో మాత్రం స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ మీద ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు హీరోయిన్లు అంటే అందరూ 25 నుంచి 30 ఏళ్ల వయసు వారే ఉంటున్నారు. వారే కమిట్ మెంట్లు ఇచ్చేసి.. మళ్లీ తప్పు జరిగింది.. అన్యాయం చేశారు అంటే ఎలా.. నీకు అక్కడ తప్పు జరుగుతుందని తెలిసి కూడా నువ్వు అక్కడకు వెళ్లావు.
అంటే నువ్వే కావాలని వెళ్లావు. నీ అవసరం కోసం నువ్వు తప్పులో పాల్గొంటున్నావ్. అలాంటప్పుడు మళ్లీ ఇండస్ట్రీ మీద బురద చల్లడం దేనికి.. మీకు అన్నీ తెలిసి చేసినప్పుడు దానికి ఇండస్ట్రీ బాధ్యత వహించదు అని గుర్తుంచుకోవాలి అంటూ సంచలన కామెంట్లు చేసింది జీవిత. మరి ఆమె కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.