Drishyam 2 : దృశ్యం సీక్వెల్‌పై అప్‌డేట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు.. వెంకీ ఖాతాలో మ‌రో హిట్ చేర‌డం ఖాయం

Drishyam 2 : ఆరేళ్ళ క్రితం మ‌ల‌యాళంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం దృశ్యం. మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. కేర‌ళ‌లో ఈ చిత్రం 75 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టింది. ఓ మ‌ల‌యాళ చిత్రం ఈ రేంజ్‌లో వ‌సూళ్ళు రాబ‌ట్ట‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది. దీంతో తెలుగు, త‌మిళం, కన్న‌డ సింహ‌ళీ భాష‌ల‌లో దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ రీమేక్ కూడా మంచి హిట్ కావ‌డంతో జీతూ జోసెఫ్ సీక్వెల్ ప్లాన్ చేశాడు. దృశ్యం 2 పేరుతో మోహ‌న్ లాల్ హీరోగా సినిమా చేయ‌గా, ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది.

క‌రోనా నేప‌థ్యంలో ఓటీటీలో విడుద‌లైన దృశ్యం 2 చిత్రంకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రు మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సీక్వెల్‌ను కూడా ఇంత అద్భుతంగా రూపొందించినందుకు ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను ప్ర‌శంసిస్తున్నారు. థియేట‌ర్ లో సినిమాను విడుద‌ల చేసి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ల‌మ‌ని పేర్కొంటున్నాఉ. ఈ సినిమా ఇంత పెద్ద విజ‌యం సాధించ‌డంతో దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రీమేక్ చేస్తారంటూ వెంక‌టేష్‌తో పాటు జీతూ జోసెఫ్‌కు మెసేజ్‌లు ఉప్పెన‌లా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ అప్‌డేట్ ఇచ్చాడు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఇప్ప‌టికే దృశ్యం 2 చిత్ర రీమేక్ రైట్స్ ద‌క్కించుకోగా, ఇందులో హీరోగా వెంక‌టేష్ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అయితే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కోసం వేచి చూసిన అభిమానుల కోసం జీతూ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. హీరో వెంక‌టేష్‌,నిర్మాత సురేష్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌తో క‌లిసి దిగిన ఫొటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ దృశ్యం 2 రీమేక్ మార్చిలో మొద‌లు కానుంద‌ని పేర్కొన్నాడు. దీంతో వెంక‌టేష్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. తెలుగులోను ఈ సినిమా హిట్ కావ‌డం ఖాయమ‌ని, వెంకీ ఖాతాలో మ‌రో హిట్ చేర‌డం ప‌క్కా అని ముచ్చ‌టించుకుంటున్నారు. ప్ర‌స్తుతం వెంక‌టేష్ ఎఫ్ 3తో పాటు నార‌ప్ప చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల‌కు సంబంధించి రిలీజ్ డేట్స్ కూడా ఇప్ప‌టికే వ‌చ్చేశాయి.

Advertisement