JD Chakravarthy : మా నాన్న మీద ఒట్టు.. అందరు హీరోయిన్లకు ట్రై చేశా.. జేడీ చక్రవర్తి కామెంట్లు..!
NQ Staff - May 30, 2023 / 11:31 AM IST

JD Chakravarthy : జేడీ చక్రవర్తి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన అనేక పాత్రల్లో నటించారు. ఎక్కువగా విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అప్పట్లో ఆయన హీరోగా చాలా మంచి సినిమాలు చేశారు. యూత్ పుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు అప్పట్లో ఆయన కేరాఫ్ అడ్రస్.
కాగా ఆయన ఇప్పుడు హీరోగా పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఇక ఆయనకు వయసు పెరుగుతున్నా సరే ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. కానీ అప్పుప్పుడు సినిమాల్లో మాత్రం నటిస్తున్నారు. ప్రస్తుతం హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్ లో నటిస్తున్నారు. ఇందులో ఈషారెబ్బా కూడా నటిస్తున్నారు.
ఇక వీరిద్దరూ కలిసి తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఓంకార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో ఓంకార్ ఓ చిలిపి ప్రశ్న వేశాడు. మీరెప్పుడైనా హీరోయిన్లను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారా అని అడగ్గా.. చక్రవర్తి స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ.. మా నాన్న మీద ఒట్టు. దాదాపు అందరు హీరోయిన్లకు ట్రై చేశా అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. దాంతో షో మొత్తం ఆద్యంతం నవ్వులు పూశాయి. ఇక ఈ షోలో జేడీ చక్రవర్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి షోలో నానా రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.