Nihar Kapoor: జ‌య‌సుధ ఏంటి త‌న కొడుకుని విల‌న్‌గా మార్చేసింది..!

Nihar Kapoor:స‌హ‌జ న‌టి జ‌య‌సుధ కొన్ని ద‌శాబ్ధాల వ‌ర‌కు స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. క‌థానాయిక‌గా జ‌య‌సుధ న‌ట‌న‌ని ప్ర‌తి ఒక్క‌రు ఎంత‌గానో ఇష్ట‌ప‌డ్డారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గాను జ‌య‌సుధ ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. అయితే ఈ మ‌ధ్య ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. భర్త నితిన్ కపూర్ మరణానంతరం జయసుధ పూర్తిగా సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

Jayasudha Son Nihaar kapoor Look in Gangster Gangaraju Movie
Jayasudha Son Nihaar kapoor Look in Gangster Gangaraju Movie

సహజనటి జయసుధ తెలుగు-తమిళం- హిందీ-మలయాళ పరిశ్రమలలో న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఎంత‌గానో ఆకట్టుకుంది. హిందీ నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ని 1985లో రెండో వివాహం చేసుకున్న జ‌య‌సుధ‌కు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు నిహార్ బిజినెస్ మేన్. రెండో వాడు శ్రేయాన్ కపూర్ హీరో అయ్యారు. శ్రేయాన్ జాతీయ స్థాయి క్రీడల్లో షూటర్ గానూ రాణించారు.

2020లో పెద్ద కొడుకు నిహర్ కపూర్ పెళ్లితో సెటిలయ్యాడు. దిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత్ కౌర్ ని అతడు వివాహమాడారు. పెద్దకుమారుడు శ్రేయాన్ష్ ఆరేళ్ల క్రితం `బస్తీ` అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత శ్రేయాన్ష్ కనిపించలేదు.

తొలి ఫెయిల్యూర్ తర్వాత శ్రేయాన్ష్ పరిశ్రమకు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా జయసుధ చిన్న కుమారుడు నిహార్ కపూర్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రంతో అతడు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. మెడలో సాలువా ధరించి.. చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంతో కూడిన నిహార్ లుక్ ని రీసెంట్‌గా రిలీజ్ చేసారు. లక్ష చదలవాడ.. వేదిక దత్ హీరో..హీరోయిన్లుగా `గ్యాంగ్ స్టర్ గంగరాజు` తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. నిహార్ అలుక్ ఆక‌ట్టుకునేలా ఉంది.