Jayasudha : ఆరు పదుల వయసులో ఆ సీనియర్ నటికి మళ్ళీ పెళ్ళంట.! నిజమెంత.?
NQ Staff - January 3, 2023 / 02:48 PM IST

Jayasudha : పెళ్ళికి వయసుతో పనేముంది ఈ రోజుల్లో.! అయినా, వివిధ కారణాలతో జీవితంలో ఒంటరిగా మిగలాల్సి వచ్చినప్పుడు, ఆ ఒంటరితనాన్ని భరించలేక.. తోడు కోసం ఆశపడితే తప్పెలా అవుతుంది.?
సీనియర్ నటి జయసుధ కొన్నాళ్ళ క్రితం భర్తను కోల్పోయారు. అప్పటినుంచి ఆమె ఒంటరితనాన్ని భరించక తప్పడంలేదు. ఈ క్రమంలో జయసుద మరో పెళ్ళికి సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో జయసుధ మరో పెళ్ళి చేసుకుంటున్నారంటూ.. ముహూర్తాలు కూడా పెట్టేశారు కొందరు సోషల్ మీడియా వేదికగా.
వెబ్ మీడియాలో కూడా ఈ మేరకు కథనాలొచ్చాయి. అయితే, జయసుధ మాత్రం మళ్ళీ పెళ్ళి ఆలోచన లేదంటున్నారు.
అవన్నీ పుకార్లే…
తన మీద దుష్ప్రచారం జరుగుతోందంటూ సీనియర్ నటి జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అవడం ద్వారా, ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందుతానంటున్నారామె.
పలు సినిమాల్లో అవకాశాలతోపాటు, జయసుధకి వెబ్ సిరీస్‌ల నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. అన్నట్టు, జయసుధ ఇటీవల నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్‌లో సందడి చేసిన విషయం విదితమే. జయసుధ భర్త హఠాన్మరణం నేపథ్యంలో బాలకృష్ణ ఆమె కుటుంబానికి అప్పట్లో అండగా నిలిచారు. జయప్రద కూడా తన స్నేహితురాలికి అండగా వున్నారు ఆ సమయంలో.