కుక్క‌ను అవ‌మానించార‌ని, షూటింగ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్

స్టార్ న‌టీన‌టుల‌కి కొన్ని క్యాలిక్యులేష‌న్స్ ఉంటాయి.వాటిని ఎవ‌రైన తుంగ‌లోకి తొక్కారా వెంటనే రియాక్ష‌న్ చూపిస్తారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇండ‌స్ట్రీలో చాలానే జ‌రిగాయి. రీసెంట్‌గా శృతి హాస‌న్ షూటింగ్ మ‌ధ్యలో నుండి వెళ్లిపోవ‌డం హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. లాభం చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న‌ప్పుడు జనాలు తండోప‌తండాలుగా రావ‌డంతో క‌రోనా ఎక్క‌డ అంటుకుంటుందేమోన‌ని వెళ్లిపోయింది. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోలేదంటూ చిత్ర బృందంపై ఫైర్ అయింద‌ట‌.

ఇలానే గ‌తంలో ఓ స్టార్ హీరోయిన్ త‌న కుక్క‌కు అవ‌వ‌మానం జ‌రిగింద‌ని షూటింగ్ ఆపేసి వెళ్ళిపోయింద‌ట‌. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు అప్ప‌ట్లో న‌టిగా ఓ వెలుగు వెలిగిన జ‌య‌ల‌లిత‌. హాలీవుడ్‌లో మంచి విజ‌యం సాధించిన జేమ్స్ బాండ్ త‌ర‌హాలో గూఢ‌చారి 116 అనే సినిమాని నిర్మాత డూండీ తెర‌కెక్కించారు. ఇందులో కృష్ణ హీరోగా న‌టించ‌గా, క‌థానాయిక‌గా జ‌య‌ల‌లిత‌ని ఎంపిక చేశారు.

గూఢ‌చారి 116 చిత్ర షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో ముగ‌స్తుంద‌నుకునే స‌మ‌యంలో జ‌య‌లలిత పెంపుడు కుక్క‌ని ఎవ‌రో అవ‌మానించార‌ట‌. దీంతో హార్ట్ అయిన జ‌య‌లలిత షూటింగ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయింద‌ట‌. ఆమె వ్య‌వ‌హారంపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫైర్ అయ్యార‌ని స‌మాచారం. ఆమె ఇచ్చిన కాల్షీట్స్ కన్నా ముందే జ‌యల‌లిత‌, కృష్ణ కాంబినేష‌న్‌లో సీన్స్ కూడా పూర్తి చేశార‌ట‌. 1967 లో విడుదలైన ‘గూఢచారి 116’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా త‌ర్వాత జ‌య‌ల‌లిత ఎన్నో ఆఫ‌ర్స్ అందుకుంది. తమిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా కూడా స‌త్తాచాటింది.

Advertisement