Faria abdullah: జాతి ర‌త్నాలు బ్యూటీ కూడా మొద‌లెట్టేసింది.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

ఈ రోజుల్లో ఒక్క హిట్ వచ్చిందంటే చాలు హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చేస్తుంది. కృతి శెట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే జాతి రత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ చిత్రం సూపర్ హిట్టవ్వడంతో దాదాపు అందరికి గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా హీరో నవీన్ పొలిశెట్టి అయితే ఇప్పుడు స్టార్ అయిపోయాడు. ఈయన వరస సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ నుంచి పిలుపులు అందుతుంటే కూడా కాదంటున్నాడు. ఇక్కడ ఖాళీ లేదు తర్వాత చూసుకుందాం అంటున్నాడు నవీన్. మరోవైపు ప్రియదర్శి, రాహుల్ కూడా చాలా బిజీ అయిపోయారు. కానీ హీరోయిన్ మాత్రం ఎందుకో క్లిక్ కావడం లేదు. షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల వైపు వచ్చిన ఫరియా అబ్దుల్లాకు ఇప్పుడు ఎందుకో అవకాశాలు మాత్రం ఊహించినట్లుగా రావడం లేదు.

దానికి ఆమె హైట్ ప్రధాన కారణం. టాలీవుడ్ లో ఉన్న హీరోలందరి కంటే హైట్ ఎక్కువగా ఉంది ఫరియా. ఇదే ఈమెకు శాపంగా మారుతుంది. దానికితోడు తొలి సినిమాలో అందాల ఆరబోతకు దూరంగా ఉంది ఫరియా. దాంతో గ్లామర్ షో చేయదేమో అనే టాక్ కూడా వచ్చింది. కానీ అలాంటివేం లేవని ఇప్పుడు అర్థం అవుతుంది. తాజాగా ఓ హాట్ ఫోటోషూట్ చేసి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది ఈ భామ. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ హైట్ ఉన్న హీరోయిన్ గతంలో అనుష్క ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఫరియా అబ్దుల్లా ఆ టాప్ ప్లేస్ అందుకుంది. గ్లామర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని హాట్ ఫోజులు ఇస్తుంది. ఇప్పుడు విడుదలైన ఫొటోలు చూస్తుంటే ఇదే విషయం అర్థమవుతుంది. క్లీవేజ్ షో కూడా చేస్తూ పిచ్చెక్కిస్తుంది లేడీ జాతిరత్నం. ఈ ఫోటోలు చూసిన తర్వాత దర్శక నిర్మాతలు ఎవరైనా ఈమె వైపుకు లుక్ వేస్తారేమో చూడాలిక.