Jaswanth: గ‌త వారం బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌స్వంత్ ఎంత రెమ్యున‌రేష‌న్ వెన‌కేసుకున్నాడంటే..!

Jaswanth: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. డిసెంబ‌ర్ 20న ఫినాలే జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. ఇక హౌజ్ నుండి ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. గ‌త వారం అనారోగ్యంతో బాధపడుతున్న జస్వంత్ పడాల ఎలిమినేట్ అయ్యాడు. వైద్య చికిత్స కోసం ఇంటి నుంచి బయటకు జెస్సీని పంపించడంతో ఇంటి సభ్యులు, బిగ్‌బాస్ ప్రేక్షకులు, జెస్సీ అభిమానులు షాక్ గురయ్యారు.

jaswanth-remuneration-revealed
jaswanth-remuneration-revealed

జెస్సీ తిరిగి హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తాడ‌ని అందరు అనుకున్నారు కాని వెర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్న జస్వంత్ పడాల ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. దీంతో వైద్య పరీక్షల కోసం నిన్ను బయటకు పంపిస్తున్నాం. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు రండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు.

అయితే మెడికల్ చెకప్ కోసం బయటకు తీసుకెళ్లడం కారణంగా జ‌స్వంత్ ని క్వారంటైన్‌లో ఉంచారు. సీక్రెట్ రూమ్‌లో సంతోషంగా ఇంటి సభ్యుల ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే మ‌ళ్లీ అత‌ని ఆరోగ్యం క్షీణించింది. ఫైన‌ల్ రిపోర్ట్స్ చూసి అతనిని బ‌య‌ట‌కు పంపాల‌ని అనుకున్నారు.

దీంతో నామినేషన్‌లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్‌ సేఫ్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ నుంచి వెళ్లేముందు కంటెస్టెంట్లకు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. దీంతో ప్రేక్షకుల కన్నా మరింత క్షుణ్ణంగా జెస్సీ అబ్జర్వ్‌ చేసిన ఉంటాడని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

jaswanth-remuneration-revealed1
jaswanth-remuneration-revealed1

ది వారాలకు గాను జెస్సీకి ఎంత ముట్టిందన్నది సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జెస్సీకి వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన పది వారాలకు గాను మొత్తం రూ. 10 -15 లక్షల వరకు వెనకేసుకున్నట్లు అంచనా.