Jaswanth: ఫ్ల‌యింగ్ కిస్‌లు ఇస్తున్న జ‌స్వంత్.. మ‌నోడు మాములోడు కాదంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్‌

Jaswanth: హౌజ్‌లో ఉన్న‌ప్పుడు జ‌స్వంత్ చాలా అమాయ‌కుడిలా క‌నిపించాడు. కాని అత‌ను బ‌య‌ట‌కు వ‌చ్చాక విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. ఐదో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్నా, . అనారోగ్యంతో హౌస్‌ను వీడాడు. కానీ, బయటకు వచ్చిన తర్వాత మాత్రం రచ్చ చేస్తున్నాడు.

jaswanth--propose-to-swetha
jaswanth–propose-to-swetha

బిగ్ బాస్ ఐదో సీజ‌న్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ ఒకడు . మొదటి వారంలో ఆనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు.

షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇది అతడికి మైనస్ అయింది. తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే సమాధానం చెప్పాడు జెస్సీ. మరీ ముఖ్యంగా ఆరంభంలోనే కెప్టెన్ అయిన అతడు.. ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం ఇస్తూ సత్తా చాటాడు. అప్పట్లో అతడికి ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు

వర్టిగో అనే వ్యాధితో బాధ పడుతూనే చాలా రోజుల పాటు హౌస్‌లో కొనసాగాడు. కానీ అది క్రమక్రమంగా ఎక్కువ అవడంతో జెస్సీని కొన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉంచి చికిత్సను అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో పదో వారం ఇంటి నుంచి బయటకు పంపేశారు.

బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అతడు తీరక లేకుండా తిరుగుతున్నాడు. విజయవాడలో అతడితో ర్యాలీని కూడా చేశారు అక్కడి స్థానికులు. ఇక, తోటి కంటెస్టెంట్లతో కలిసి జెస్సీ తరచూ పార్టీలు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నాడు.ఇటీవల జెస్సీ.. శ్వేతా వర్మ, అషు రెడ్డితో ఓ పార్టీ చేసుకున్నాడు.

jaswanth--propose-to-swetha1 (1)
jaswanth–propose-to-swetha1 (1)

ఆ సమయంలో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలోనే శ్వేతా ఓ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో అతడు.. ఆమెకు ఐలవ్యూ అంటూ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. అలాగే, ఫ్లయింగ్ కిస్‌లు కూడా ఇచ్చి షాకిచ్చాడు. హౌస్‌లో కామ్‌గా ఉన్న అతడు.. బయట కొంటెగా కనిపించడంతో అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు