Jaswanth: జ‌స్వంత్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. హౌజ్‌లో ఉన్నందుకు ఎందుకంత ఇబ్బందిగా ఫీల‌య్యాడు..!

Jaswanth: బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొన్న జ‌స్వంత్.. రెండు వారాలుగా అనారోగ్యంతో బిగ్ బాస్ హౌస్‌లో ఆట ఆడలేకపోయాడు. టాస్క్‌ల సంగతి పక్కనపెడితే.. ‘వర్టిగో’ వ్యాధి వల్ల జెస్సీ చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. జెస్సీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో హౌస్ నుంచి బయటకు పంపించారు. అయితే సీక్రెట్ రూంలో కొన్నాళ్లు ఉంచి చికిత్స అందించారు. అయితే ట్రీట్ మెంట్ తరువాత మళ్లీ తిరిగి హౌస్‌లో వ‌స్తాడ‌ని అనుకున్నారు.

jaswanth health is stable2
jaswanth health is stable2

కాని ఇలాంటి పరిస్థితుల‌లో జెస్సీ బ‌య‌ట‌కు రావ‌డం మంచిద‌ని వారు కూడా భావించి ప‌దో వారం ఎలిమినేట్ చేశారు. ఇంతకీ జెస్సీ‌కి వచ్చిన వ్యాధి ఏంటి? అది అంత ప్రమాదకరమైనదా? అసలు వర్టిగో అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇందులో ఎన్ని దశలు ఉంటాయి.. ఏ దశలో ఉంటే ప్రమాదం అనే విషయానికి వస్తే.. ‘వర్టిగో’ అంటే తలతిరిగే జబ్బు అని అంటుంటారు.

jaswanth health is stable1
jaswanth health is stable1

వైద్యపరిభాషలో ‘వర్టిగో’ అంటుండగా.. గిడ్డీనెస్, డిజ్జీనెస్‌ పేర్లతో పిలుస్తుంటారు. పురుషుల్లో కంటే మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి విజయవాడలో జెస్సీ చికిత్స తీసుకున్నాడట. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురవ్వడం, ఆటలు ఆడటం వల్ల వ్యాధి ఎక్కువైంది.

బయటకు వచ్చాక ఆ ఒత్తిడి తగ్గిపోయింది.. విజయవాడలో చికిత్స కూడా తీసుకున్నాడు.. ఇప్పుడు బాగానే ఉన్నాడంటూ జెస్సీ ఆరోగ్యం గురించి చెప్పేశాడు. మొత్తానికి జెస్సీకి విజయవాడలో భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాన్ మీట్లు పెట్టేశారు. జెస్సీ క్రేజ్ ఏంటో సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేశారు.

జ‌స్వంత్ రీసెంట్‌గా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి పార్టీలు చేసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ మీట్లు, ఊరేగింపులతో జెస్సీ దుమ్ములేపేశాడు. ఇంత బాగుంటే.. బిగ్ బాస్ ఎందుకు బయటకు పంపించాడు అని అంతా అనుకుంటున్నారు.