Janhvi Kapoor: గ్రీన్ డ్రెస్‌లో హొయ‌లు పోయిన శ్రీదేవి త‌న‌య‌.. హాట్ అందాల‌తో హీటెక్కిపోతున్న ఫ్యాన్స్

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల త‌న‌య జాన్వీ క‌పూర్ ఒక‌వైపు సినిమాల‌తో అల‌రిస్తూనే మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో వెరైటీ పోస్ట్‌లు పెడుతూ నెటిజ‌న్స్ మ‌న‌సులు దోచుకుంటుంది. త‌న డ్యాన్స్ వీడియోల‌తో పాటు ప‌లు ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోల‌ను రెగ్యుల‌ర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే జాన్వీ తాజాగా రూహి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా దిగిన ఫొటోల‌ను షేర్ చేసుకుంది. గ్రీన్ డ్రెస్‌లో హొయ‌లు పోతూ ఫొటోల‌కు ఫోజులిచ్చిన జాన్వి అంద‌రిని ఫిదా చేసింది.

జాన్వీ క‌పూర్ తొలి సారి రూహి అనే థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టించగా, ఈ చిత్రంలో జాన్వీతో పాటు రాజ్ కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర పోషించారు. వ‌రుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అలెక్స్ ఓనెల్, సీమా పహ్వా, ఆమ్నా షరీఫ్, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో న‌టించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రోవైపు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో జాన్వీని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. దీంతో జాన్వీ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం కానుంద‌నే టాక్ వినిపిస్తుంది.

 

 

Advertisement