Janhvi Kapoor : దేవర లో జాన్వీ కపూర్ పాత్ర గురించి షాకింగ్ అప్డేట్
NQ Staff - June 7, 2023 / 08:55 PM IST

Janhvi Kapoor : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే రివీల్ చేయడం జరిగింది. అలాగే జాన్వీ కపూర్ యొక్క పోస్టర్ ను కూడా రివీల్ చేయడం జరిగింది.
జాన్వీ కపూర్ యొక్క అందాల ఆరబోత ఈ సినిమా లో ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ విడుదల అయిన పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇప్పటి వరకు హిందీ లో చాలా సినిమా లు చేసింది. కానీ ఒక్కటి కూడా కమర్షియల్ బ్రేక్ ఆమెకు ఇవ్వలేదు. అయినా కూడా ఏదో విధంగా కెరీర్ ను కొనసాగిస్తూ వస్తోంది.
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ అమ్మడు తెలుగు లో మొదటి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ యొక్క పాత్ర గురించి ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. నిన్న మొన్నటి వరకు జాలరీ అయిన శ్రీకాంత్ కూతురు పాత్రలో జాన్వీ కపూర్ కనిపించబోతుందని అన్నారు.
ఇప్పుడు జాన్వీ కపూర్ జాలరి కూతురుగా కనిపించే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రేంజ్ లో ఆమె పాత్ర ట్విస్ట్ ఉంటుందని.. ఆమె చేసే యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు మరియు ప్రేక్షకులు సర్ ప్రైజింగ్ గా ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.