Janhvi kapoor: పుష్ప‌రాజ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం.. త‌గ్గేదే లే అంటున్న జాన్వీ క‌పూర్

Janhvi kapoor: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం ‘పుష్ప: ది రైజ్’. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా మూవీ బ్లాక్‌బ‍స్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో మించి హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. `పుష్ప – ది రైజ్` బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. ఈ చిత్రం హిందీలో భారీ విజయాన్ని సాధించింది.

Janhvi Kapoor - IMDb

ప్రేక్షకులు మరియు సెలబ్రిటీల నుండి కూడా మంచి సమీక్షలను పొందింది. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు యాక్షన్ ఎంటర్ టైనర్ లో బన్ని నటనను ప్రశంసించారు. బోనీకపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్ పుష్పపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా అర్జున్‌ చెల్లెలు జాన్వీ కపూర్‌ సైతం పుష్పరాజ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.

సోషల్‌ మీడియా వేదికగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ప్రపంంచంలోనే కూలెస్ట్‌ మ్యాన్‌ అంటూ స్టోరీ పెట్టింది. ఇప్పటికే బీటౌన్‌లో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా అల్లు అర్జున్‌ కూడా బాలీవుడ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవడం ‘అబ్బా సాయిరాం’ అన్నట్లుగా ఉంది.

ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జనవరి 7న దక్షిణాది భాషల్లో విడుదలైంది పుష్ప చిత్రం. కానీ హిందీలో ఇంకా విడుదల కాలేదు. త్వరలో జనవరి 14న సంక్రాంతి కానుకగా హిందీలో కూడా రిలీజ్‌ చేయనుంది అమెజాన్‌. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో ‘పుష్ప’ ఫైర్ గట్టిగానే అంటుకుంది. స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లతోపాటు హీరోయిన్లు కూడా పుష్ప రాజ్‌కు ఫిదా అవుతున్నారు.

janhvi kapoor
janhvi kapoor

దర్శకనిర్మాత కరణ్ జోహార్ పుష్ప పై ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అతని తాజా చిత్రం పుష్పపై ప్రశంసలు కురిపించారు. పుష్పను వీక్షించాను. పుష్పలో అల్లు అర్జున్ ..నమ్మశక్యం కానిది..ఎంత స్టార్ డమ్! ఎంత ప్రదర్శన.. అంటూ ఆశ్చర్యార్థకాలతో కూడుకున్న ప్రశంసలు కురిపించాడు. బన్ని నటన విషయంలో కరణ్ ఎంతగా ఇంప్రెస్ అయ్యారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.