JANHVI KAPOOR: న‌టిగానే కాదు చిత్ర‌కారిణిగాను అద్భుత టాలెంట్ చూపించిన అందాల ముద్దుగుమ్మ‌

దివి నుండి భువికి దిగి వ‌చ్చిన అతిలోక సుందరి శ్రీదేవి. చూడ చ‌క్క‌ని అందం, ఎంతో మ‌నోహ‌రంగా కనిపించే శ్రీదేవి అకాల మ‌ర‌ణం చెందారు. ఆమె వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ సెల‌క్టెడ్‌గా సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. అయితే ఇటీవ‌ల త‌న‌లో దాగి ఉన్న కొత్త క‌ళ‌ను కూడా బ‌య‌ట‌కు తీసింది జాన్వీ. ఆ మ‌ధ్య పెయింటింగ్ వేసిన ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్టిన జాన్వీ తాజాగా మ‌రో ఫొటో షేర్ చేసింది. మృదువైన చేతుల‌తో కుంచె ప‌ట్టుకొని జాన్వీ గీసిన ఫొటో ఎంతో అందంగా ఉందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అందమైన అమ్మాయి రూపును వేసిన జాన్వీ కపూర్ తన ఫేస్ చూపించకుండా కేవలం థైస్ మాత్రమై చూపిస్తూ ఇప్పటికి అయినా నన్ను నేను పెయింటర్ గా గుర్తించుకోవచ్చా అంటూ ప్రశ్నించింది. జాన్వీ కపూర్ కు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. మీరు ఒక మంచి పెయింటర్ మాదిరిగా ఆ పెయింటింగ్ ను వేశారు. మీ చేతిలో అద్బుతమైన కళ ఉందంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. జాన్వీ ప్రస్తుతం తమిళంలో నయనతార చేసిన ఒక సినిమాను హిందీలో రీమేక్ చేస్తుంది. ఆ సినిమా తో పాటు మరి కొన్ని సినిమాల చర్చలు కూడా జరుగుతున్నాయి. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమాలో జాన్వీ క‌పూర్ క‌థానాయిక అని వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.