Janhvi Kapoor: జాన్వీ క‌పూర్ అందాల ఆర‌బోత‌తో హీటెక్కిపోతున్న సోష‌ల్ మీడియా

Janhvi Kapoor: అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్ద‌లు త‌న‌య‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ త‌క్కువ స‌మయంలో ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కించుకంది. సినిమాల క‌న్నా కూడా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ అందాల‌తో ట్రెండింగ్‌లో నిలుస్తుంది. దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

జాన్వి తన రాబోయే చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌ను ఇటీవల ముగించింది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జాన్వీ ఈ మ‌ధ్య వ‌రుస ఫొటోల‌తో ర‌చ్చ చేస్తుంది. వీలున్న‌ప్పుడ‌ల్లా అందాల ఆర‌బోత‌తో యువ‌కుల గుండెల్లో బాణాలు దించుతుంది. జిమ్‌లోను, సోష‌ల్ మీడియాలోను జాన్వీ క‌పూర్ అందాల జాత‌ర చేస్తుంది. రెగ్యుల‌ర్ గా కొత్త కొత్త ఫొటోల‌ను షేర్ చేసే జాన్వీ తాజాగా వైట్ షార్ట్ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌తో కెమెరాకు ఫోజులిచ్చింది.బోల్డ్ లుక్‌లో ఈ అమ్మ‌డిని చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు.

జాన్వీ క‌పూర్ ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘అంగ్రేజీ మీడియం’, ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. జాన్వీ నటిస్తున్న ‘దోస్తానా’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. మరో మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్ కంప్లీట్ అయింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గాక ఈ అమ్మడు వ‌రుస సినిమాల‌తో ర‌చ్చ చేయ‌డం ఖాయం.

మ‌రో వైపు శ్రీదేవి, బోనీకపూర్ ల చిన్న కూతురు ఖుషీ కపూర్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇటీవలే బికినీతో ఎవ్వరూ ఊహించని విధంగా హాట్ షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా రెడ్ డ్రెస్ లో హీట్ పెంచింది.ఈ అమ్మడికి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తన హాట్ పిక్స్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్న ఈ భామ‌ మరింత క్రేజ్ ను మూటగట్టుకుని పనిలో పడింది. ఖుషి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేలా కన్పిస్తోంది. మొత్తానికి ఇద్ద‌రు అక్కా చెల్లెళ్లు సినిమాల‌తో క‌న్నా అందాల ఆర‌బోత‌తో అంద‌రి దృష్టి ఆకర్షిస్తున్నారు.