Janhvi Kapoor: ల‌బ్బూకి ల‌వ్ యూ చెప్పిన జాన్వీ.. ఎవ‌రా వ్య‌క్తి అంటూ ఆరాలు..!

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ త‌న‌కు సంబంధించిన ఏ విష‌యాన్నైన అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా జాన్వీ కపూర్‌ పచ్చబొట్టు వేయించుకున్న విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్‌కు స్వీట్‌ షాకిచ్చింది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో టాటూ ఆర్టిస్ట్‌ ఆమె చేతికి ఐ లవ్‌ యూ మై లబ్బూ అని పచ్చబొట్టు వేశాడు. ఇది చూసిన అభిమానులు లబ్బూ ఎవరబ్బా? అని తెగ ఆలోచించారు. ఒకవేళ జాన్వీ ఎవరితోనైనా పీకల్లోతు ప్రేమలో ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ అలాంటిదేమీ లేదు.

శ్రీదేవి తన గారాలపట్టి అయిన జాన్వీని లబ్బూ అని పిలిచేది. ఈ క్రమంలో ‘ఐ లవ్‌ యూ మై లబ్బూ.. నువ్వు ఈ ప్రపంచలోనే బెస్ట్‌ బేబీవి’ అని శ్రీదేవి పేపర్‌ మీర రాసిచ్చిన వాక్యాల్లో నుంచి ‘ఐ లవ్‌ యూ మై లబ్బూ ‘అనే పదాలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా తన చేతి మీద పర్మినెంట్‌ టాటూ వేయించుకుంది.

జాన్వీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీదేవి ఉన్నారనేది జగమెరిగిన సత్యం. తన తల్లిని స్మరించుకుంటూ ఆమె చేతిరాతతో తనపై ఒలకబోసిన ప్రేమను టాటూ రూపంలో మణికట్టుపై వేయించుకున్నది. ఈ విషయాన్ని ఆమెనే ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.