Janhvi Kapoor Dating Shikhar Pahariya In Mumbai : ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన జాన్వీకపూర్.. అర్థరాత్రి ఇవేం పనులు..!
NQ Staff - July 17, 2023 / 11:27 AM IST

Janhvi Kapoor Dating Shikhar Pahariya In Mumbai :
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం కొట్టేస్తోంది. దివంగత శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అదే జరిగితే శ్రీదేవి లాగానే జాన్వీ కూడా సౌత్ లో బిగ్ స్టార్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న ఈ భామ.. ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటుంది. ముంబై వీధుల్లో ఎక్కువగా హల్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె తన ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిపోయింది.
కారులో వచ్చి..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ కొంత కాలంగా ఆమె ఘాటైన ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు బయట కనిపిస్తున్నారు. తాజాగా మరోసారి ఇద్దరూ కారులో అర్థరాత్రి సమయంలో ముంబైలో కనిపించారు.
ఇద్దరూ వర్షంలో డిన్నర్ డేట్ కు వచ్చినట్టు తెలుస్తోంది. తన ప్రియుడి పక్కనే కూర్చున్న జాన్వీ.. ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అంతే కాకుండా ఇద్దరూ వైట్ డ్రెస్ లోనే వచ్చారు. వీరిద్దరూ పెండ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె కొంత కాలం క్రితం ప్రియుడితో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.