Janhvi Kapoor: రెండు రోజుల పెళ్లి.. తిరుప‌తిలో మ్యారేజ్‌, చెన్నైలో సంగీత్ అని చెప్పిన జాన్వీ క‌పూర్

Janhvi Kapoor: అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. ద‌ఢ‌ఖ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎద అందాతో పాటు న‌డుము వ‌య్యారాలు చూపిస్తూ యూత్‌ని తెగ ఆక‌ర్షిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

బాలీవుడ్‌లో ఈ అమ్మడి రచ్చ ఇప్పుడు మామూలుగా లేదు. ఎక్కడ చూసిన ఈ బ్యూటీ గురించే టాక్‌. ఈ అమ్మడి షో గురించి చర్చ. నాన్‌స్టాప్‌గా ఫొటో షూట్స్ చేస్తూ.. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. పీకాక్‌ మేగజీన్‌ కోసం జాన్వీ ఫోటో షూట్ చేయ‌గా, ఇందులో ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు చూస్తుంటూ మతిపోతుంది. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

త‌న గ్లామర్‌ షోకి నో బార్డర్స్ అని నిరూపించుకుంటున్న జాన్వీ క‌పూర్ సోషల్‌ మీడియాలోనూ సెన్సేషనల్‌గా మారిపోతుంది.తాజాగా ఈ అమ్మ‌డు మ్యాగ‌జైన్ కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా, ఇందులో త‌న పెళ్లి ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చింది. బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు, శ్రీదేవి గారాల ప‌ట్టి అయిన జాన్వీ క‌పూర్ పెళ్లి ఎలా చేసుకుంటుంది? అని అడిగితే ఖచ్చితంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ అని ఎవ‌రైన అంటారు

కాని , జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలో త‌న పెళ్లి ఎక్క‌డ జ‌రుగుతుందో చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.పెళ్లికి ముందు మిస్ జాను జరుపుకునే చివరి పార్టీని అందమైన దీవిలో పడవపైన ఎంజాయ్ చేస్తుందట! ఇక పెళ్లి ఎక్కడో తెలుసా? మన తిరుపతిలోనట! పూర్తి సంప్రదాయ బద్ధంగా పూలు, మామిడి తోరణాలతో అలంకరించిన పందిరలో ఏడు అడుగులు వేస్తుందట యువ సుందరి.

ఇక సంగీత్, మెహందీ లాంటి ఈవెంట్స్ అన్నీ త‌న త‌ల్లి తిరిగిన ప్లేస్ చెన్నైలోని సొంతింట్లో అట‌.రిసెప్ష‌న్ ఆలోచ‌న అయితే లేదంటుంది. వివాహ వేడుకలు రెండు రోజుల్లో ఖతమ్ చేసేస్తాను అని కూడా చెబుతోంది . ఏవేవో డిజైనర్ కాస్ట్యూమ్స్ కాకుండా కాంచీవరం చీరతో లక్ష్మీదేవిలా పెళ్లి రోజు కళకళలాడిపోతానని మురిపెంగా చెప్పింది.