Janasena : వారాహి యాత్ర రోజు వారి ఖర్చు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

NQ Staff - June 7, 2023 / 11:28 PM IST

Janasena : వారాహి యాత్ర రోజు వారి ఖర్చు ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

Janasena : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వారాహి యాత్ర ప్రారంభిస్తాడా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు.

ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. మొదటి షెడ్యూల్లో పర్యటించబోతున్న నియోజక వర్గాల జాబితా కూడా విడుదల అయింది. వారాహి యాత్ర జరుగుతున్నన్ని రోజులు కూడా పవన్ కళ్యాణ్ వెంట జనసేన కార్యకర్తలు వేలాది మంది ఉండబోతున్నారు.

ప్రతి రోజు మూడు పూటలా పెద్ద మొత్తంలో కార్యకర్తలకు భోజన ఏర్పాటు చేయడంతో పాటు వారికి బస ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకునేందుకు ముందస్తుగా స్థానిక కార్యకర్తలకు మరియు నాయకులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందట.

వీటన్నింటికీ కలిపి జనసేన భారీగా ఖర్చు చేస్తోంది అంటూ వైకాపా నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ విషయం పక్కన బెడితే అమెరికాకు చెందిన ఒక తెలుగు దేశం పార్టీ ఎన్నారై స్వయంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు ఆఫర్ చేశారని అందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది.

రోజుకు 50 లక్షల రూపాయలను ఖర్చు చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అందులో నిజా నిజాలు నిగ్గు తేడాల్సి ఉంది. కానీ వేలాది మందితో కూడిన యాత్ర నిర్వహించాలంటే ఈ రోజుల్లో కచ్చితంగా భారీగా ఖర్చు అవ్వడం ఖాయం. అది ఏ పార్టీ వారు నిర్వహించిన కూడా ఖర్చు అనేది ఖాయం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us