Case Filed Against Posani Krishna Murali: ప‌వ‌న్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేసిన పోసాని.. కేసు పెట్టిన జ‌న‌సేన‌

Case Filed Against Posani Krishna Murali: వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ కామెంట్స్ చేసిన నేప‌థ్యంలో పోసాని కృష్ణ ముర‌ళి వ‌రుస‌గా మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నీచంగా తిట్టాడు. పవన్ ఫ్యాన్ తన భార్యను ఉద్దేశిస్తూ ‘మీ పని వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. నిజం కాదా?’ అని మెసేజ్ పెట్టాడని పోసాని కృష్ణ మురళి తెలిపారు. ”పవన్ కళ్యాణ్ నీ సైకో ఫ్యాన్స్ తో నా భార్య పట్ల ప్రశ్నలు వేయించావు కదా.. అందుకే నేను కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నా అని అన్నాడు.

 

‘పవన్ కల్యాణ్.. నువ్వు షూటింగ్ లకు వెళ్ళగానే మీ పెళ్ళాం అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు.. అది నిజమా కాదా?. ఆ బిడ్డలు నీకు పుట్టలేదు అంట.. పని వాళ్ళకే పుట్టారు అంట.. నిజమా కాదా?” అంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ‘సిగ్గు లేని నా కొ*కా’ వంటి అభ్యంతరకరమైన అసభ్య పదజాలాన్ని పోసాని ఉపయోగించారు. మొత్తం ఎపిసోడ్ లో పవన్ కు వ్యతిరేకంగా పోసాని ఉపయోగించిన భాష ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ తల్లి అతని భార్య మరియు పిల్లలను కూడా ఇందులోకి లాగడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ అభిమానులు చేసిన తప్పుకు.. ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టడం ఎంతవరకు సమంజసమని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళిపై జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ డ్ కేసు నమోదు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

జనసేన లీగల్ టీం ఫిర్యాదు కాపీని తయారు చేయగా శంకర్ గౌడ్ ఎస్ఐ కౌశిక్ కు అందించారు. అంతేకాకుండా పోసానిని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని, ఆయన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. పోసాని ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇక గత రాత్రి పోసాని ప్రెస్ మీట్ ను అడ్డుకోవడానికి వచ్చిన పవన్ అభిమానులను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.