RRR: ఎమోష‌న్స్‌తో కూడిన జ‌న‌ని సాంగ్.. వీడియో అదిరిపోయింది..!

RRR: ప్ర‌పంచ‌మంతా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు భారీ బడ్జెట్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

TheNewsQube-
janani-song-release-from-rrr
janani-song-release-from-rrr

చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించింది.

ఇందులో భాగంగా ‘జనని’ అనే పాట విడుదల చేసింది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను విడుదల చేశారు. జనని పాట ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఓ సోల్‌. ఈ పాట కోసం కీరవాణి అన్నయ్య రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు. ఇందులో క్యారెక్టర్స్ చాలా ఎమోష‌న్స్ తో క‌నిపిస్తున్నాయి. పాట ఆకట్టుకుంటుంది.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర కథా సారం మొత్తం చెబుతూ సాగే గీతమే ‘జనని… ప్రియభారత జనని’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పారు.‘జనని’ సాంగ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి ఓ సోల్‌. ఈ సాంగ్‌ కోసం పెద్దన్న కీరవాణి రెండు నెలలు శ్రమించాడు. ఆయనే లిరిక్స్‌ అందించాడు. ఈ సాంగ్‌లో కనిపించని ఎమోషన్స్‌ ఉంటాయి. అంటే ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలా సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ ఎమోషనల్ లోనే దాగి ఉంటుంది అని అన్నారు.