Jagapathi babu: తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని అలరించిన ఆయన ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌లో మెరుస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడు. హీరోగా కన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లోనే జగపతిబాబుకి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి.

తండ్రి ప్రఖ్యాత నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఆశీస్సులతో మొదట హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జగపతిబాబు ఎన్నో హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. మొదటి సినిమా స్వప్న లోకం సినిమా ద్వారా వెండితెరకి తెరంగేట్రం చేసిన జగపతి బాబు, ఆ మూవీతోనే మంచి పేరు అందుకున్నారు. అక్కడి నుండి తన సొంత టాలెంట్ తోనే మిగతా ప్రొడక్షన్ లలో కూడా సినిమా అవకాశాలు అందుకుంన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన విలన్స్ సపోర్టింగ్ రోల్స్ తో జనాలకు మరింత దగ్గరవుతున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా గురించి, అందులో చేసిన బసి రెడ్డి పాత్ర గురించి, హీరో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’స్క్రిప్ట్ బాగా కుదిరింది. అందులో నాది ఎగ్రసివ్ క్యారెక్టర్ అయితే.. తారక్‌ది చాలా కూల్ క్యారెక్టర్.
దాంతో బసిరెడ్డి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అంత పెద్ద హీరో నా పాత్రను ఒప్పకోవడమే కష్టం. తారక్ యాటిట్యూడ్ బాగా నచ్చింది. అయితే బసిరెడ్డి పాత్రను ఒప్పుకున్న తారక్.. తర్వాత నాకు కావాల్సినంత పనిష్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. షూటింగ్ సమయంలో రోజూ ఫోన్ చేసి వాయించేవాడు. నీ పాత్ర ఇంత బావుంది. అంత బావుందనేవాడు. రక రకాలుగా తిట్టేవాడు.. అది కూడా ప్రేమతోనే.
- Advertisement -
సినిమా విడుదల తర్వాత జరిగిన ఫంక్షన్‌లో కూడా నా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బసిరెడ్డి గుర్తుంటాడు. తర్వాతే నేను గుర్తుంటాను అన్నాడు. తను అలా అనడం చాలా పెద్ద స్టేట్‌మెంట్. ఆ తర్వాత నన్ను దూరం పెడుతున్నానని చెప్పారు.

‘బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్‌తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించకండి’అని తారక్ అన్నారు. దానికి నేను ఓకే తారక్ అన్నాను. అయిపోయింది’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.