Jagapathi Babu Reacts On Love Affair Soundarya : సౌందర్యతో ఎఫైర్ మీద స్పందించిన జగపతిబాబు.. వారసులు కావాలంటే అలా చేశాడంట..!

NQ Staff - September 19, 2023 / 11:28 AM IST

Jagapathi Babu Reacts On Love Affair Soundarya : సౌందర్యతో ఎఫైర్ మీద స్పందించిన జగపతిబాబు.. వారసులు కావాలంటే అలా చేశాడంట..!

Jagapathi Babu Reacts On Love Affair Soundarya :

జగపతి బాబు అంటే ఇండస్ట్రీలో తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ హీరోగా ఆయనకు ఎనలేని కీర్తి ఉంది. అయితే ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా విలన్ పాత్రల్లోనే నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఇందులో ఆయనకు సౌందర్యతో ఎఫైర్ మీద ప్రశ్న వచ్చింది. దానిపై జగపతి బాబు మాట్లాడాడు. నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత మా నాన్న వంశానికి వారసుడు ఉండాలని కండీషన్ పెట్టాడు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం చనిపోయాక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు వారసుడు లేకపోతే ఏంటి అని అడిగాను.

ఇంట్లో అయితే వీలు కాదు గానీ.. బయట ఎక్కడైనా ట్రై చేయమంటావా అని అడిగాను. ఒక పూజారి నా దగ్గరకు వచ్చి ఫలానా హీరోయిన్ ఉంది సార్ మీరు కలవొచ్చు అన్నాడు. దానికి నేను షాక్ అయిపోయాను. సమాజం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. ఆ సమయంలోనే కొందరు నాకు సౌందర్యతో ఎఫైర్ అంటూ వార్తలు రాశారు. దాని మీద నేను ఆ పత్రికల యాజమాన్యాలకు కంప్లయింట్ ఇచ్చాను.

దాంతో ఆ వార్తలు రాసిన వారి మీద చర్యలు తీసుకున్నారు. అందుకే నేను దాని మీద ఎన్నడూ స్పందించలేదు అంటూ తెలిపారు జగపతిబాబు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవతున్నాయి. అయితే సౌందర్యతో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపాడు జగపతి బాబు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us