Jagapathi Babu: చెన్నైలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో క‌లిసి లంచ్ చేసిన జ‌గ్గూభాయ్

Jagapathi Babu: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో స‌త్తా చాటుతున్నాడు. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా,ప‌లు సినిమాల‌లో ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. ఆయన నటించిన ‘టక్‌ జగదీష్‌’ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక శర్వానంద్‌, సిద్దార్థ్‌ ‘మహా సముద్రం’, సాయి ధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’ చిత్రాల్లో కీలక పాత్రలో నటించాడు.

Jagapathi Babu Had Lunch with NTR Fans
Jagapathi Babu Had Lunch with NTR Fans

ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో ‘రాజమన్నార్‌’ అనే పవర్‌ ఫుల్‌ విలన్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుని విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు విరామ సమయంలో దొరికింది. ఆ స‌మ‌యాన్ని స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు.

తాజాగా జ‌గ‌ప‌తి బాబు చెన్నైకి వెళ్ల‌గా, అక్క‌డ ఎన్టీఆర్ అభిమానులతో క‌లిసి లంచ్ చేశాడు. ఆ త‌ర్వాత వారంద‌రితో క‌లిసి జ‌గ‌ప‌తి బాబు ఓ ఫొటో దిగాడు. ఈ పిక్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన జ‌గ‌ప‌తి బాబు చెన్నై లోక‌ల్ హోట‌ల్‌లో తార‌క్ ఫ్యాన్స్‌తో క‌లిసి లంచ్ చేయడం సంతోషంగా అనిపించింద‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఎన్టీఆర్‌తో క‌లిసి జ‌గ‌ప‌తి బాబు ప‌లు చిత్రాల‌లో న‌టించగా, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం అంద‌రికి బాగా క‌నెక్ట్ అయింది.

చెట్ల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ..సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి. డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న సినిమా ‘సింబా’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.