Jagan vs pawan kalyan war : జగన్ వర్సెస్ పవన్, వీళ్ల మాటల యుధ్ధంతో బాబుకు మైలేజ్?
NQ Staff - July 21, 2023 / 04:34 PM IST

Jagan vs pawan kalyan war : ఎలక్షన్స్ కి నెలల గ్యాపే ఉండడంతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కేశాయి. తాజాగా జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేన్నంతలా జగన్, పవన్ పాలిటిక్స్ లిమిట్స్ దాటి పర్సనల్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ కామెంట్లకు కూగా దిగుతున్నారు. మరోవైపు పవన్ యాత్ర, ప్రచారాల్లో భాగంగా జగన్ ని ఓ మాటనడమే ఆలస్యం. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ప్రెస్మీట్లు పెట్టి వాడి వేడి మాటలతో దేత్తడి అనిపిస్తున్నారు. వాలంటరీ వ్యవస్థపై జగన్ చేసిన కామెంట్స్, వాలంటరీలపై చేసిన అభియోగాలతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత వైరం పెరిగింది. నోటీసులు, కేసులు, ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలంటూ కంప్లీట్ పొలిటికల్ న్యూస్ స్పేస్ ను కొన్నాళ్లపాటు వీళ్లే ఆక్యుపై చేశారు. దీంతో జగన్ ను కావాలనే పవన్ రెచ్చుగొడుతున్నాడా? పవన్ ను జగన్ రెచ్చగొట్టి ట్రాప్ చేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
జగన్ ను పవన్ ఏదో ఓ రకంగా కామెంట్ చేయడం ద్వారా, ఆధారాలున్నా లేకపోయినా ముందయితే నిందలేసో, మాటలనో హెడ్ లైన్స్ లోకొస్తున్నాడు జనసేనాని. దీంతో జగన్ కౌంటర్లిస్తూ కాస్త ఘాటుగానే రియాక్టవడంతో పవన్ ఆటోమేటిక్ గా మరిన్ని పంచులతో పర్సనల్ ఎటాకింగ్ కి దిగుతున్నాడు. ఇలా పవన్ ను కావాలనే జగన్ రెచ్చగొట్టి ట్రాప్ చేస్తున్నాడన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. వాలంటరీ వ్యవస్థ, హ్యూమన్ ట్రాఫికింగ్, పర్సనల్ డేటా అంటూ పవన్ మాట్లాడిన ప్రతీదానికి జగన్ తనదైన స్టయిల్లో నవ్వుతూనే స్ట్రాంగ్ కౌంటర్లిస్తున్నాడు. దాంతో మళ్లీ సీన్ రిపీట్. ఆవేశంతో ఊగిపోతూ పవన్ స్పీచులు దంచేయడమే ఇక. ఇలా పవన్ ని ప్రోవోక్ చేయడం వల్ల జగన్ కి పొలిటికల్ గా కలిసొస్తుందా? ప్రజల్లో పార్టీకి బలం పెరుగుతుందా? చంద్రబాబు ఎక్కడా ఎలివేట్ కాకుండా డామినేట్ చేయడానికే జనసేనని జగన్ ఫోకస్ చేస్తున్నాడా? ఈ ఇష్యూలన్నీ ఫ్యాన్ గుర్తుకి ఓటు శాతం పెంచేలా ప్రభావితం చేస్తాయా? లేక ప్రభుత్వాన్ని ఒంటరిగా అయినా బలంగా ఎదుర్కుంటున్నందుకు జనసేనకి పాజిటివ్ పాయింట్ గా మారుతుందా? వెనక్కి తగ్గకుండా తన వాయిస్ ను వినిపిస్తున్నందుకు గ్లాస్ పార్టీకి ప్లస్ అవుతుందా? అంటూ పబ్లిక్ లో కూడా డిస్కషన్స్ కూడా స్టార్టయిపోయాయి.
నిజానికి పవన్ వ్యాఖ్యలు జనాల వరకూ స్ట్రాంగ్ గా వెళ్తున్నా ఆధారాలు లేకుండా ఆరోపించడంతో క్రెడిబిలిటీ కరువవుతోందనేది ఓపెన్ ఫ్యాక్ట్. మరోవైపు పైసీపీ కూడా చేయాల్సిన అభివృద్ధి పనులను, ప్రజా సమస్యలను పక్కనబెట్టి కేవలం పవన్ నే టార్గెట్ చేస్తూ, ఆయనపై కౌంటర్లు, కామెంట్లకే సమయాన్ని కేటాయిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు కొందరు. దీంతో ఈ మాటల యుద్ధం బాబుకు మేలు చేస్తుందా అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ, ప్రభుత్వంపై పక్కాగా విమర్శలు చేస్తూ ఎలక్షన్స్ నే టార్గెట్ గా పెట్టుకుంటూ పనిచేస్తోంది టీడీపీ. ఎంత ఫైట్ చేసినా ఇప్పటికిప్పుడు ఓటు శాతం పెంచుకుని మరీ ఎక్కువ సీట్లు దక్కించుకునేంత సీన్ జనసేనకు లేదు. మరోవైపు విధానాలపరంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే జనాలు సైకిల్ వైపు చూసే ఛాన్సుంది. కాబట్టి వైసీపీ వర్సెస్ జనసేన సీక్వెన్స్ చంద్రబాబుకే మైలేజి తెచ్చిపెడుతుందనేది మరికొందరి వాదన. మరి అదేం విచిత్రమో.. ఫైట్ చేసిన వాళ్లకు కాకుండా పక్కవాళ్లకు కలిసిరావడం ఏంటో? అఫ్ కోర్స్.. పవన్ ఏది చేసినా అంతే కదా.