Jagan strong warning to Pawan Kalyan and Chandra babu : పవన్, బాబుకు ఇచ్చి పడేసిన జగన్.. వాలంటీర్లకు మద్దుతుగా సీఎం..!

NQ Staff - July 21, 2023 / 07:22 PM IST

Jagan strong warning to Pawan Kalyan and Chandra babu : పవన్, బాబుకు ఇచ్చి పడేసిన జగన్.. వాలంటీర్లకు మద్దుతుగా సీఎం..!

Jagan strong warning to Pawan Kalyan and Chandra babu : జగన్ చాలా వరకు ప్రజల సమస్యలకే ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటారు. అందుకే జనసేన, టీడీపీ, ఎల్లో మీడియా చేసే తప్పుడు ఆరోపణలను పెద్దగా పట్టించుకోడు. కానీ ఈ సారి ఆయన జోలికి కాకుండా.. వాలంటీర్ల జోలికి వచ్చాడు పవన్ కల్యాణ్‌. దాన్ని ఎల్లో మీడియా ఎత్తి చూపించింది. చంద్రబాబు మద్దుతు తెలిపాడు.

ఈ వ్యాఖ్యలపై ఇన్ని రోజులు జగన్ మౌనంగా ఉండటాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ సరైన సమయం చూసి వారి బండారాన్ని మొత్తం బయట పెట్టేశాడు. మా వాలంటీర్ల జోలికే వస్తారా.. మీ తాట తీస్తా అని చెప్పకనే చెప్పాడు. తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఈరోజు జరిగిన సభలో జగన్ తన మాటల బాణాలు వదిలారు.

నిస్వార్థంగా పని చేస్తున్న వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వంగలపూడి అనిత చేసిన నీచపు వ్యాఖ్యలు జగన్ సహనాన్ని పరీక్షించాయి. ఇక ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. అమ్మాయిలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే కడుపు చేయాలి ఒకరు(నందమూరి బాలకృష్ణ ) అంటారు.

మీరు సినిమాల్లో చేశారు.. నేను కాలేజీల్లోనే చేశానని ఒకరు(చంద్రబాబు) చెబుతారు. వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ అమ్మాయిలకు ద్రోహం చేసేవ్యక్తి మరొకరు(పవన్ కళ్యాణ్). ఇక సందు దొరికితే చాలు అమ్మాయిలతో అసభ్యంగా స్విమ్మింగ్ ఫూల్ లో ఫోజులు ఇచ్చేవ్యక్తి మరొకరు. వీరా మా వాలంటీర్ల గురించి మాట్లాడేది అంటూ ప్రత్యర్థుల గుండెల్లో గునపం దించారు జగన్.

వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారు ఎల్లో బ్యాచ్. రామోజీరావు స్క్రిప్టు రాసి ఇస్తుంటే.. దానికి చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కల్యాణ్‌ దాన్ని ఫాలో అవుతున్నాడు. వాళ్లవి కుట్రపూరిత మాటలని మీరు గ్రహించాలి. ఎందుకంటే వాలంటీర్లు ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు.. మన ఊర్లలోని మన పిల్లలే. వాళ్ల గురించి మీకు తెలియదా అంటూ జగన్ అనగానే.. సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది.

మరి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు బాబు గానీ, పవన్ గానీ, పచ్చ మీడియా గానీ నోరు మెదపట్లేదు. ఎందుకంటే వారు చేసింది తప్పు అని వారికి కూడా తెలుసు. జగన్ చేసిన వ్యాఖ్యల్లో నిజాలే ఉన్నాయి తప్ప అబద్దాలు వెతికినా దొరకవని వారికి అర్థమైంది. అందుకే తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉండిపోయారు. జగన్ తన జోలికి వచ్చినా ఊరుకుంటారు గానీ.. తనను నమ్ముకున్న వారి జోలికి వస్తే మాత్రం ఊరుకోరని వారికి అర్థం అయినట్టు ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us