Jagan sensational comments on Pawan Kalyan : పవన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. జగన్ సెన్సేషనల్ కామెంట్స్..!

NQ Staff - July 21, 2023 / 03:23 PM IST

Jagan sensational comments on Pawan Kalyan : పవన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. జగన్ సెన్సేషనల్ కామెంట్స్..!

Jagan sensational comments on Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.. ఎవరు ఏ టాపిక్ ఎత్తితే ఆ టాపిక్ సంచలనంగా మారుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య వాలంటీర్లపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా తాజాగా ఈ విషయంపై సీఎం జగన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు..

ఏపీలో చేనేత నేస్తం పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ డబ్బులు జమ చేశారు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈయన మాట్లాడుతూ పవన్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్ అయ్యాయి..

వాలంటీర్లలో అందరు మన గ్రామం పిల్లలే.. మన వాళ్ళే అని వాలంటీర్ సేవలను పవన్ తప్పుబట్టారు అని ఈయన క్యారెక్టర్ ఎలాంటిదో అందరికి తెలుసు అని అన్నారు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా? అమ్మాయిలను లోబరుచుకుని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం, వదిలేయడం పవన్ కళ్యాణ్ చేస్తుంటాడు.

అలాంటి వ్యక్తి వాలంటీర్ల పై కామెంట్స్ చేయడం ఏంటని వారి క్యారెక్టర్ల గురించి మాట్లాడడం ఏంటని ఈయన ప్రశ్నించారు. వాలంటీర్ క్యారెక్టర్ గురించి పదేళ్లుగా బాబు దగ్గర వాలంటీర్ గా ఉంటున్న ప్యాకేజీ స్టార్ మాట్లాడడం ఏంటని పవన్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తాము చేసిన పనులు మరో చరిత్ర అని మీ బిడ్డ ప్రభుత్వంపై రానున్న రోజుల్లో మరిన్ని విమర్శలు చేస్తారని జగన్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us