Jacqueline: జాక్వెలిన్ డ్రెస్ చూస్తే గుబులు పుట్ట‌డం ఖాయం..!

Jacqueline: శ్రీలంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. సాహో సినిమాలో ఐటెం నంబర్‌తో సౌత్‌ ఆడియన్స్‌కు హాయ్ చెప్పింది. త్వరలో పవర్‌ స్టార్‌ తో జోడి కడుతున్నారు. అందుకే మన ఆడియన్స్‌ కూడా అమ్మడి మూమెంట్స్‌ను క్లోజ్‌గా వాచ్‌ చేస్తున్నారు. ఈ శ్రీలంక భామ ఓ ఇండియన్‌తో ప్రేమలో పడిందట.

Jacqueline stunning look2
Jacqueline stunning look2

సౌత్‌ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె రిలేషనల్‌ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వినికిడి. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులో కూడా ఈ అమ్మ‌డు ఇరికింది. ఈ విష‌యంలో వార్త‌ల‌లో బాగా నానుతుంది.

Jacqueline stunning look1
Jacqueline stunning look1

స్కిన్‌ షో విషయంలో పెద్దగా హద్దులు పెట్టుకోని శ్రీలంకన్‌ బ్యూటీ స్క్రీన్ మీద ఏ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తారో… సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో అగ్గి రాజేస్తుంటారు. అందుకే అమ్మడి సోషల్ మీడియా ఖాతాలకు కోట్లల్లో ఉంటారు ఫాలోవర్స్‌. ఇంత ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఓ బోల్డ్‌ ఫోటో షేర్ చేస్తే.. ఇక అంతే… సోషల్ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే.

Jacqueline stunning look
Jacqueline stunning look

తాజాగా ఈ అమ్మ‌డు వెరైటీ డ్రెస్‌లో ర‌చ్చ చేసింది. జాక్వెలిన్‌ని ఇలా చూసి అంద‌రి మ‌తులు పోతున్నాయి.జాక్వెలినా, మ‌జాకానా అంటున్నారు. క్యూట్ పిక్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

బాలీవుడ్‌ కథనాల ప్రకారం జాక్వెలిన్‌ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించడానికి ఒక ఫ్రెంచ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ను కూడా ఖరారు చేశారట.