Vinod: జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్ శ్రీమతిని ఎప్పుడైన చూశారా..!

Vinod: జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో చాలా మంది న‌టీన‌టులకు మంచి పాపులారిటీ ద‌క్కిన విష‌యం తెలిసిందే. కొంద‌రు చీరక‌ట్టి అచ్చం అమ్మాయి మాదిరిగా అద‌ర‌గొడుతుంటారు.వారిని చూస్తే అబ్బాయి అనే డౌట్ కూడా రాదు. కేవలం ఆడ వేషాల నుంచి ఈయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అసలు వినోద్‌ను మేకప్ లేకుండా చూస్తే ఎవ‌రు గుర్తు కూడా ప‌ట్ట‌రు.

వినోద్ ఒక్కసారి మేకప్ వేసుకుని స్టేజీపైకి వచ్చాడంటే అమ్మాయిలు కూడా ఔరా అనుకోవాలి. అంత అందంగా ముస్తాబవుతాడు వినోద్. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాటు వివాదాల‌తో కూడా వినోద్ వార్త‌లలోకి ఎక్కాడు. ఓ సారి ఆయ‌న‌పై ఇంటి ఓన‌ర్ దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించ‌గా ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఓసారి ఇంట‌ర్వ్యూలో మీరు నిజంగానే అబ్బాయా లేదంటే అమ్మాయా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయిపోయాడు వినోద్. నేను మగాన్ని.. తేడాగాన్ని కాదు.. త్వరలోనే పెళ్లి చేసుకుని అందరి నోళ్లు మూయిస్తానన్నాడు వినోద్. అన్న‌ట్టుగానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చాడు.

జబర్దస్త్ వినోద్ యూట్యూబ్‌లో వినోద్‌తో వినోదం పేరుతో కొత్త ఛానెల్ ప్రారంభించారు. అందులో మొదటి వీడియో తన పెళ్లి గురించే తీశారు. పెళ్లి వివరాలను చెప్పడంతో పాటు భార్యను కూడా అందరికీ పరిచయం చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న మేన‌త్త కూతురు విజ‌య‌ల‌క్ష్మీని సీక్రెట్‌గా వివాహం చేసుకున్న‌ట్టు చెప్పారు. ఆమె స్వస్థలం కడప.

జబర్దస్త్‌లో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులపై ఎన్నో పుకార్లు ఉన్నాయని.. అవన్నీ నిజం కాదన్నారు వినోద్. లేడి గెట‌ప్స్ వేసే వారికి అసలు పెళ్లి అవుతుందా అని అంద‌రు అడిగేవారు, వారంద‌రికి ఇప్పుడు స‌మాధానం వ‌చ్చింది అని వినోద్ చెప్పారు. తనకే కాదు జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే హరికృష్ణకు కూడా పెళ్లి జరిగిందని వినోద్ చెప్పారు. త్వరలో మిగతా వారికి కూడా పెళ్లి జరుగుతుందని అన్నారు.