Jabardasth Rowdy Rohini : ఆస్పత్రి బెడ్డుపై జబర్దస్త్ రోహిణి.. కాలుకు సర్జరీ చేసిన డాక్టర్లు..!
NQ Staff - May 18, 2023 / 09:41 AM IST

Jabardasth Rowdy Rohini : జబర్దస్త్ రోహిణి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. గతంలో సీరియల్స్ చేసిన ఆమెకు.. బిగ్ బాస్ తోనే చాలా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. లేడీ కమెడియన్ గా ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు తన చలాకీ తనంతో ఆకట్టుకుంటుంది.
అయితే ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రోహిణికి కూడా వ్యక్తిగతంగా చాలా బాధలు ఉన్నాయంట. ఈ విషయాలను ఆమెనే చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఆస్పత్రి బెడ్డుపై ఉన్న వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నాకు ఐదేండ్ల క్రితం రోడ్డు ప్రమాదం అయినప్పుడు నా కాలికి రాడ్డు వేశారు.
ఇప్పుడు దాన్ని తీయించుకోవడం కోసం మొన్న హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. కానీ రాడ్డును తీయడం వీలు కాదని వారు చెప్పారు. దాంతో నాకు గతంలో సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వచ్చాను. వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాకు గతంలో సర్జరీ చేశారు. ఇప్పుడు మళ్లీ వారిని సంప్రదించాను.
వారు నన్ను చూసి పర్వాలేదు మేం చేస్తామని చెప్పారు. దాదాపు పది గంటల పాటు కష్టపడి రాడ్డును తీసేశారు. కానీ కాలును కింద పెట్టొద్దని, చెప్పారు. ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోమని సూచించాను. నేను పూర్తిగా కోలుకున్న తర్వాతనే మళ్లీ సెట్ లోకి అడుగు పెడుతాను అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.