Jabardasth Pavitra : జబర్దస్త్ పవిత్ర నోటి నుంచి బూతు మాటలు.. నెటిజన్ల ఫైర్..!
NQ Staff - March 11, 2023 / 06:38 PM IST

Jabardasth Pavitra : కొన్ని సార్లు ప్రోగ్రామ్స్ లలో కూడా నోరుజారుతున్నారు నటీ, నటులు. ఇప్పుడు సినిమాలతో పోటీ పడుతూ రేటింగ్స్ సంపాదించుకుంటున్నాయి బుల్లితెర ప్రోగ్రామ్స్. అయితే ఈ బుల్లితెర ప్రోగ్రామ్స్ లలో కూడా ఈ నడుమ బూతు మాటలు బాగా వినిపిస్తున్నాయి. కొందరు నటులు అయితే రెచ్చిపోయి మరీ బూతులు మాట్లాడేస్తున్నారు.
వారు కావాలని మాట్లాడుతున్నారా.. లేకపోతే రేటింగ్స్ కోసమే మాట్లాడుతున్నారా అనేది తెలియదు గానీ.. దాంతో వారు విమర్శలు పాలు మాత్రం అవుతున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ పవిత్ర చేసిన పనితో మరోసారి విమర్శలు పాలు అవుతోంది. జీ తెలుగు ఛానెల్ లో ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ ప్రోగ్రామ్ బాగా వ్యూస్ ను సంపాదించుకుంటోంది.
సరిగ్గా చెప్పకపోవడంతో..
కాగా తాజాగా ఈ ప్రోగ్రామ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బుల్లెట్ భాస్కర్ తో కలిసి జంటగా వచ్చింది జబర్దస్త్ పవిత్ర. అయితే పవిత్ర ఇచ్చే క్లూస్ ఆధారంగా భాస్కర్ ఆమె ఏమనుకుంటుందో చెప్పే టాస్క్ ఇచ్చాడు ప్రదీప్. కాగా భాస్కర్ మాత్రం సరిగ్గా చెప్పలేక పోతుంటాడు. కానీ పవిత్ర పదే పదే ట్రై చేస్తోంది.
అయినా సరే బుల్లెట్ భాస్కర్ సరిగ్గా చెప్పకపోవడంతో.. నీ యక్కా అంటూ బూతు మాట అనేసింది పవిత్ర. దాంతో అక్కడున్న వారంతా కూడా షాక్ అయిపోయారు. ఆమె అలా అనడం కరెక్ట్ కాదంటూ అంతా విమర్శిస్తున్నారు. మరి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి.