నోరు జారిన న‌రేష్‌.. కంగారులో వ‌య‌స్సు చెప్పి నాలుక‌ క‌ర‌చుకున్న జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు

Jabardasth Naresh: కొంద‌రికి లోపాలే వ‌రంగా మారుతుంటాయి. ఆ లోపాల‌ని అధిగ‌మిస్తూ, వాటిని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటూ ఉన్న‌త స్థాయిలో చాలా మంది ఉన్నారు. అలంటి వారిలో జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు న‌రేష్ ఒక‌రు. చూడ్డానికి మూడు అడుగులే ఉంటాడు. కాని ఆయ‌న స్టేజ్ ఎక్కితే లీడ‌ర్స్ కూడా చెమ‌టలు ప‌ట్టాల్సిందే. త‌న‌దైన కామెడీతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో న‌వ్విస్తుంటాడు న‌రేష్‌.

జ‌బ‌ర్ద‌స్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు. అయితే న‌రేష్ వ‌య‌స్సుపై ఇప్పటికీ అంద‌రిలో క‌న్ఫ్యూజ‌న్. అత‌డు చిన్న పిల్లాడా, పెద్దాడా అనేది ఎవ‌రికి తెలియ‌దు. ఒక్కోసారి చిన్న పిల్ల‌ల‌కు సంబంధించి స్కిట్స్‌లోను న‌రేష్ ఉంటుండ‌డంతో అత‌ను చిన్న పిల్లాడ‌నే అని అంద‌రు భావిస్తుంటారు.

కాని న‌రేష్‌కు ఓటు హ‌క్కు కూడా వ‌చ్చేసింది. ఈ సీనియర్ ఈ చిట్టి మిరపకాయ్ వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. 1999లో పుట్టిన న‌రేష్‌కి ఇప్పుడు 22 ఏళ్లు. అత‌న్ని చూసిన వారు ఈ విష‌యాన్ని న‌మ్మడం క‌ష్ట‌మే. ఓసారి ఢీ షో జూనియర్స్‌కు న‌రేష్ రాగా, ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు.

బుల్లెట్ భాస్క‌ర్ టీంలోకి వ‌చ్చిన త‌ర్వాత న‌రేష్ జీవితం పూర్తిగా మారింది. ఇప్పుడు అతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్టు అత‌ని కెరీర్ సాగుతుంది. అంద‌రి టీంలో పార్టిసిపేట్ చేస్తూ త‌న‌దైన కామెడీ అందిస్తున్న న‌రేష్ జ‌బ‌ర్ధ‌స్త్ కోసం స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయ‌డ‌ట‌. ఒక్కసారి స్క్రిప్ట్ ఏంటి.. స్కిట్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే గుర్తు పెట్టుకుని స్టేజ్‌పైనే పర్ఫార్మ్ చేస్తుంటాడు నరేష్. ఇ

ది నిజంగానే అరుదైన టాలెంట్ అంటూ భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పాడు. నరేష్ వల్లే తమ టీంకు అంతమంచి పేరొచ్చిందని చెప్తుంటాడు ఆయన. జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత సొంతూళ్లో ఇల్లు కూడా కట్టుకున్నాడు ఈయన. సిటీలో కూడా ఫ్లాట్ తీసుకున్నాడు. మొత్తానికి బుడ్డోడిలా కనిపిస్తాడు కానీ బుల్డోజర్ మాదిరి పంచ్ డైలాగులు పేలుస్తూ నవ్విస్తున్నాడు నరేష్.

ఇప్పటివరకు ఏ షోలో కూడా తన వయసు గురించి చెప్ప‌ని న‌రేష్ తొలిసారి జబర్దస్త్‌లోనే నోరు జారాడు . ఓ స్కిట్‌లో భాగంగా తన వయసు 22 అంటూ ఒప్పేసుకున్నాడు. హైపర్ ఆది స్కిట్ చేస్తున్నపుడు 22 ఏళ్ళుగా జిమ్ చేస్తున్నా అంటూ అసలు వయసు చెప్పేసాడు నరేష్.