Varsha: విష్ణుప్రియ చెల్లితో రీల్స్ చేసిన ఇమ్మాన్యుయెల్‌.. కోపంలో వర్ష !

Varsha: తెలుగు టీవీ చానల్స్‌లో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న జోడీగా వర్ష, ఇమ్మాన్యుయేల్ టాప్‌లో ఉన్నారు. ఈ జోడీ ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్‌లు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంతో పాటు స్కిట్లపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయ‌ని చెప్పవచ్చు. బుల్లితెరపై సుధీర్- రష్మీ జోడీకి వీరు ఒక విధంగా గట్టి పోటీ ఇస్తున్నారనే చెప్పాలి. తెలుగులో సంవత్సరాల తరబడి మంచి రేటింగ్స్‌ సొంతం చేసుకుంటున్న జబర్దస్త్ షోలో సుధీర్- రష్మీ జోడీ తరువాత ఆ స్థాయిలో ఇమ్మాన్యుయేల్- వర్ష జోడీ ఫేమస్ అయింది. తక్కువ సమయంలోనే తన కామెడీ టైమింగ్‌తో ఇమ్మాన్యుయేల్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

Varsha

ఇమ్మాన్యుయేల్ బాగా పాపులారిటీని సంపాదించుకోవడానికి అతని కలర్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ జోడీపై ఇతర కమెడియన్లు వేసే పంచ్ లు వారికి ఊహించని స్థాయిలో పాపులారిటీని తెచ్చిపెట్టాయి. అయితే ఎప్పుడూ వర్షతో కనిపించే ఇమ్మాన్యుయేల్ తాజాగా విష్ణుప్రియ చెల్లి పావనితో కలిసి ఇన్ స్టాగ్రామ్ రీల్ చేశారు. పావని ఈ మధ్య కాలంలో షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

Varsha

ఇమ్మాన్యుయేల్ పావనితో కలిసి రెడ్డిగారి అమ్మాయిరా అనే పాటకు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ రీల్ చేయగా వర్ష మాత్రం ఇమ్మాన్యుయేల్‌ను కోపంతో వెక్కిరించింది. ఇమ్మాన్యుయేల్ బిక్కమొహం వేయడంతో పావని ఒక దెబ్బ వేయగా, వర్ష కూడా ఇమ్మాన్యుయేల్ పై మరో దెబ్బ వేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చేస్తున్న అల్లరి ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. మ‌రి ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి..