Jabardasth: చావు వ‌ర‌కు వెళ్లొచ్చిన జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు.. ఏం జ‌రిగిందో తెలుసా?

Jabardasth: జ‌బ‌ర్ధ‌స్త్ అనే కార్య‌క్ర‌మం ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ ప్రోగ్రాంకి ముందు చాలా మంది అవాకాశాల కోసం ఫిలిం న‌గ‌ర్ వెంట చెప్పుల‌రిగేలా తిరిగారు. ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి వెళ్లాక వాళ్ల ఫేట్ పూర్తిగా మారింది. పేరుకి పేరు, డ‌బ్బుకి డ‌బ్బు , హోదాకి హోదా ఇలా అన్ని కూడా వారికి పాజిటివ్‌గా మారాయి. అయితే కొంద‌రికి మాత్రం ఇప్ప‌టికీ ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి.

jabardasth

జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ జీవన్. ఈయన కేవలం కామెడీ మాత్రమే కాకుండా డప్పు కూడా అద్భుతంగా కొడుతుంటాడు. జిగేల్ జీవ‌న్ అనే టీం కూడా మెయింటైన్ చేస్తున్న ఆయ‌న కొద్ది రోజుల‌గా క‌నిపించ‌డం లేదు. ప‌ర్‌ఫార్మెన్స్ స‌రిగా లేదంటూ స‌త్తిపండు లాంటి టీమ్ లీడ‌ర్స్ ఆయ‌న‌ను తీసేసారు.

కొన్ని రోజులుగా జీవ‌న్ క‌నిపించ‌క‌పోవ‌డానికి వేరే కార‌ణం ఉంది. ఆయ‌న కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ విష‌యం జ‌బ‌ర్ధ‌స్త్ టీం లీడ‌ర్స్‌కి త‌ప్ప బ‌య‌ట వారెవరికి పెద్ద‌గా తెలియ‌దు. అయితే చాలా రోజుల త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంలో మ‌ళ్లీ మెరిసాడు జీవన్. గుర్తు ప‌ట్ట‌కుండా ఉన్న అత‌నిని చూసి అంద‌రు షాక్ అయ్యారు.

jabardasth

బొద్దుగా ఉండే జీవ‌న్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పీల‌గా క‌నిపిస్తూ అభిమానుల‌కి షాక్ ఇచ్చాడు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అంటూ రష్మీ గౌతమ్ అడగ‌గా, జీవన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్స్ చెప్పారని.. ఒకానొక సమయంలో చచ్చిపోతాడు అని కన్ఫర్మ్ కూడా చేసారని ఏడ్చేసాడు జీవన్.

నాకు చిన్న కూతురు ఉంది. ఫ్యామిలీని త‌ల‌చుకుంటే చాలా బాధ అనిపించింది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే కారణం జబర్దస్త్ టీమ్ లీడర్స్ అంటూ ఎమోషనల్ అయిపోయాడు జీవన్. వాళ్లే లేకపోతే చచ్చిపోయేవాన్నే అని.. వాళ్లందరికీ చేతులెత్తి దండం పెట్టాడు ఈ కమెడియన్. అనేక సార్లు ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో జీవ‌న్ పెద్ద‌గా జ‌బ‌ర్ధ‌స్త్‌లో క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు అత‌ని ఆరోగ్యం బాగుంది. ఇదే అంద‌రికి శుభ‌వార్త అని టీమ్ లీడ‌ర్స్‌తో పాటు అభిమానులు అంటున్నారు.