Faima : జబర్దస్త్ నుంచి ఫైమాకి వచ్చే రెమ్యునరేషన్ ఎంత.? ఫైమా తల్లి ఏం చెప్పిందంటే.!

NQ Staff - September 19, 2022 / 11:11 AM IST

159423Faima : జబర్దస్త్ నుంచి ఫైమాకి వచ్చే రెమ్యునరేషన్ ఎంత.? ఫైమా తల్లి ఏం చెప్పిందంటే.!

Faima : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫైమా అనే లేడీ కమెడియన్ పాపులర్ అయ్యింది. అంతకు ముందు ‘పటాస్’ కార్యక్రమంలోనూ ఆమె బోల్డంత కామెడీ చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా వుంది ఫైమా. తన కుమార్తెను బిగ్ బాస్ విన్నర్‌గా చూడాలని వుందంటూ ఫైమా తల్లి చెప్పింది న్యూస్ క్యూబ్ ఇంటర్వ్యూలో.

Jabardasth Faima Remuneration

Jabardasth Faima Remuneration

ఇంతకీ, జబర్దస్త్ ద్వారా ఫైమాకి వచ్చే రెమ్యునరేషన్ ఎంత.? ఈ క్యూరియాసిటీ చాలామందిలో వుంటుంది. మరి, ఫైమా తల్లి ఈ విషయమై ఏం సమాధానం చెప్పిందో తెలుసా.? ఆడపిల్లని అడగలేం కదా.! మగ పిల్లాడైతే, ‘నువ్వెంత సంపాదిస్తున్నావ్ రా.. అని అడగగలం.. ఆడపిల్లని అలా అడగలేం. పైగా, కుటుంబ పోషణ బాధ్యత అంతా నా కూతురు ఫైమానే చూసుకుంటుంది.

తోడబుట్టినవాళ్ళనీ చూసుకుంటుంది..’ అని ఫైమా తల్లి చెప్పుకొచ్చింది. ఇంటి అద్దె, ఇంటికి కావాల్సిన సరుకులు.. అన్నీ ఆమె స్వయంగా చూసుకున్నప్పుడు, ఆమెనెందుకు నేను సంపాదన గురించి అడగాలి.? అని ఫైమా తల్లి చెప్పుకొచ్చారు. ‘నన్ను సినిమాలకు తీసుకెళుతుంది. స్టూడియోకి కూడా తీసుకెళ్ళింది. నేను చాలా చాలా హ్యాపీ.. మేం ఒకప్పుడు పడ్డ కష్టాల నుంచి మాకు ఇప్పుడు ఉపశమనం లభించింది..’ అంటూ కొంత ఎమోషనల్ అయ్యారు ఫైమా తల్లి.