Mukku Avinash: అనూజ మెడ‌లో మూడుముళ్లు వేసిన అవినాష్‌.. వీడియో షేర్ చేసిన రాంప్రసాద్

Mukku Avinash: బుల్లితెర ప్రేక్షకులకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అవినాష్ . జబర్ధస్త్ షో ద్వారా కమెడియన్‏గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ అదే ఫేమ్‏తో ఫేమస్ రియాల్టీ షో బిగ్‏బాస్‏లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‏బాస్‏లో తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు అవినాష్. అందులో ఆరియానాతో ఎక్కువగా స్నేహం చేసి.. నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. దాదాపు పైనల్ వరకు వెళ్లిన అవినాష్.. అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాకయ్యారు.

TheNewsQube-

సోష‌ల్ మీడియాలోను అవినాష్ తెగ సంద‌డి చేస్తుంటాడు. శ్రీముఖితో కలిసి అవినాష్ వీడియోలు చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ వచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్‏స్టాలో షేర్ చేశారు.

రీసెంట్‌గా హ‌ల్దీ వేడుక కూడా జ‌రుపుకున్నాడు. అయితే ఈ రోజు జబర్ధస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. తన చిన్న నాటి స్నేహితురాలు అనూజ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ వివాహ వేడుకకు జబర్ధస్త్ టీమ్‌తో పాటు, అతడి చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు. .

కామెడీ యాక్టర్లందరూ కలిసి అవినాష్ వివాహ వేడుకల్లో సందడి చేశారు. సహ నటుడు రాంప్రసాద్ అవినాష్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవినాష్ తన పెళ్లి వీడియోని తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. కానీ రాంప్రసాద్ ఫోటోని షేర్ చేసి సారీ బ్రదర్.. బ్లండర్ మిస్టేక్ అని అంటూ అవినాష్ పెళ్లి ఫోటోలను పంచుకున్నాడు.

బిగ్‏బాస్‏లో ఉన్న సమయంలో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు అవినాష్. గతంలో ఓసారి అవినాష్ పెళ్లి గెటప్‏లో ఉన్న ఫోటోను సైతం నెట్టింట్లో షేర్ చేయడంతో నిజంగానే అవినాష్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ రూమర్లకు చెక్ పెడుతూ ఎట్ట‌కేల‌కు వివాహం చేసుకున్నాడు.