ISMART SHANKAR: డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన ఇస్మార్ట్ శంక‌ర్ .. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

రామ్ కెరియ‌ర్‌కు మంచి బూస్టింగ్ ఇచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని ఎంత‌గా షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటు రామ్‌కి అటు పూరీకి స‌రైన హిట్స్ లేని స‌మ‌యంలో ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం వారి కెరియ‌ర్‌కు మ‌రింత జోష్‌ని తెచ్చిపెట్టింది. ఒకే సినిమా ఇద్దరు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో బిజీ అయ్యేలా చేసింది. తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో డబ్బింగ్ అయ్యి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు హిందీ ప్రేక్ష‌కుల‌ని తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌న సినిమా లు ఉత్తరాదిన శాటిలైట్ ద్వారా మరియు యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటున్న నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ హిందీ వెర్షన్‌ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో పెట్టారు. టాలీవుడ్‌ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్‌ శంకర్‌కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండటంతో మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది. 200 మిలియన్ ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఆన్‌లైన్‌లో డబ్బింగ్‌ సినిమాల ద్వారా 20 కోట్ల పైగా వ్యూస్‌ తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. రామ్ నటించిన చిత్రాలు డబ్బింగ్ రూపంలో దుమ్ములేపుతుంటాయి. హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ ఇలాంటి సినిమాలు యూట్యూబ్‌లో దుమ్ములేపేశాయి. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ద్విభాష సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. లాక్‌డౌన్ త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.