NTR : ఎన్టీఆర్ 30లో ఇస్మార్ట్ బ్యూటీ..?

NTR : ఎన్టీఆర్ సినిమా అనగానే ఫ్యాన్స్లో క్రేజ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో నభా నటేశ్ కి ఛాన్స్ దక్కనుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల చేయనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించబోతున్నట్లు చర్చించుకుంటున్నారు. అందులో ఒక హీరోయిన్ నభా నటేశ్ అని అనుకుంటున్నారట. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందించబోతున్నట్టు వినిపిస్తుంది. రాజకీయ నేపథ్యం అని అనగానే చాలా మందిలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

ismart-beauty-in-ntr-30
ismart-beauty-in-ntr-30

ఈ సినిమా ఒక లీడర్, భరత్ అను నేను లాగా ఉండి యూత్ ని రాజకీయాలవైపు మొగ్గు చూపేలా ఉండబోతుందట. ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి హీరో, హీరోయిన్ల గురుంచి కూడా చర్చ మొదలైంది. ఎన్టీఆర్ డైలగ్ డెలివరి, భాష మీద ఉన్న పట్టు తెలిసిన వాళ్ళందరు సినిమా హిట్ అని ఇప్పుడే ఒక డెసిషన్ కి వచ్చేశారు. యాక్షన్, ఎమోషన్,సందేశం కలిగిన సినిమానే అయి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కైరా అద్వాని, నభా నటేష్, రష్మిక అని ఇలా ఊహాగానాలలో తెలిపోతున్నారు ఫ్యాన్స్.

NTR : ఒక సామాన్యుమైన వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడు.

అసలయితే త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 రావాల్సి ఉంది. కాని ఆ కాంబినేషన్ ప్రస్తుతానికి చేంజ్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్ భారీ హిట్ అందుకుంది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో రిపీటవుతుందంటే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రజల సమస్యల మీద పోరాడిన ఒక సామాన్యుమైన వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది. రాజకీయాల్లో వచ్చిన తారక్ ఏం చేశాడన్నది ఆధ్యంతం ఆసక్తికరంగా చూపించబోతున్నాడట కొరటాల శివ. ఎన్.టి.ఆర్.క్రేజ్ తో పోలిస్తే తన పక్కన నభా నటేష్ కి ఎంత స్కోప్ ఉంటుందో వేచి చూడాల్సిందే.

 

 

Advertisement