Ishan Kishan : మరో మహేంద్రసింగ్ ధోనీ.. ఇషాన్ కిషన్..

Ishan Kishan : ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయిన సంగతి అభిమానులందరికీ తెలిసిన విషయమే. విశాఖపట్నంలో 2005 ఏప్రిల్ 5న పాకిస్థాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ధోనీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆ రోజు ధోనీ 123 బంతుల్లోనే 148 రన్నులు కొట్టి ఇండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. వన్డేల్లో తొలిసారి సెంచరీ చేసిన ఆ కీపర్-కమ్-బ్యాట్స్ మన్ ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒట్టు. జట్టులో అతనికి చెక్కుచెదరని చోటు దక్కింది. ఆ తర్వాత టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. వన్డేల్లో, టీ20ల్లో మన దేశానికి వరల్డ్ కప్ అందించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి స్వర్ణ యుగం సంపాదించి పెట్టాడు.

అయితే?..

ఈ కామెంటరీ అంతా ఇప్పుడు ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీ ఏ రాష్ట్రం (జార్ఖండ్) నుంచైతే వచ్చాడో అదే రాష్ట్రానికి చెందిన ఇషాన్ కిషన్ అనే ఓ కుర్రాడు ఈ రోజు (శనివారం) సంచనలం రేపాడు కాబట్టి. విజయ్ హజారే వన్డే టోర్నమెంటులో మొదటి రోజే మెరుపులు మెరిపించాడు. కేవలం 94 బాల్స్ కే దాదాపు రెట్టింపు రన్నులు (173) రాబట్టాడు. ఇందులో ఫోర్లు 19, సిక్సులు 11. స్ట్రైక్ రేట్ 184.04 కావటం విశేషం. తుపాన్ రేంజ్ లో ఇషాన్ చేసిన బ్యాటింగుకి ఇండోర్(మధ్యప్రదేశ్)లోని హోల్కర్ స్టేడియం హోరెత్తి పోయింది. ఇషాన్ జార్ఖండ్ టీమ్ కెప్టెన్ కావటం మరో ముఖ్య విషయం. నాయకుడిగా తన జట్టును ముందుండి నడిపించాడు.

Ishan Kishan : another mahendra singh dhoni
Ishan Kishan : another mahendra singh dhoni

సరికొత్త చరిత్ర: Ishan Kishan

జార్ఖండ్, మధ్యప్రదేశ్ మధ్య నిర్వహించిన ఈ వన్డేలో ఇషాన్ ధాటికి జార్ఖండ్ 50 ఓవర్లలో 422 పరుగుల భారీ స్కోరు సాధించింది. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఇదే హయ్యస్ట్ స్కోర్. 42 బంతుల్లో 50 రన్నులు చేసిన ఇషాన్.. 74 బాల్స్ కి సెంచరీ నమోదుచేశాడు. తర్వాత కేవలం 12 బంతుల్లోనే మరో హాఫ్ సెంచరీ అంటే 86 బాల్స్ కే 150 మార్క్ చేరుకున్నాడు. మరో వైపు మధ్యప్రదేశ్ కేవలం 98 పరుగులకే ఆలౌటై ఘోరాతిఘోరంగా ఓటమిపాలైంది. జాతీయ జట్టుకు తనను సెలెక్ట్ చేయట్లేదన్న కసితోనే ఇషాన్ కిషన్ ఇలా విశ్వరూపం ప్రదర్శించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement