అబ్బాయి అయితే చాలు.. పెళ్లి చేసుకుంటానంటోన్న ఇషా చావ్లా

NQ Staff - January 11, 2021 / 11:41 AM IST

అబ్బాయి అయితే చాలు.. పెళ్లి చేసుకుంటానంటోన్న ఇషా చావ్లా

ప్రేమ కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇషా చావ్లా. మొదటి చిత్రంతోనే ఇషా యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇషాకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ తరువాత వాటిని నిలబెట్టుకోలేకపోయింది. వరుసగా డిజాస్టర్లు రావడంతో ప్రస్తుతం తెలుగు తెరపై ఇషా కనిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం ఇషా చావ్లా బుల్లితెరపై తళుక్కున మెరిసింది. తాజాగా సుమ క్యాష్ షోలో ఇషా చావ్లా గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

isha chawla satires on suma In cash

isha chawla satires on suma In cash

సంక్రాంతి స్పెషల్‌గా వచ్చే వారం క్యాష్ షో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ మేరకు నలుగురు అందమైన హీరోయిన్లను సుమ పట్టుకొచ్చింది. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో స్వాతి దీక్షిత్, కామ్నా జెఠ్మలాని, ఇషా చావ్లా, సంగీత లు స్పెషల్‌ గెస్ట్‌లుగా వచ్చారు. ఇక ఈ నలుగురు హీరోయిన్లతో సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. మధ్యలో సుమపైనా మంచి పంచ్‌లే పడ్డాయి. మొత్తంగా వచ్చే వారం మాత్రం మంచి ఫన్ ఉండేలానే కనిపిస్తోంది.

పండుగలకు అమ్మాయిలు ఎందుకు ఇంత అందంగా రెడీ అవుతారని సుమ ప్రశ్నించింది. అబ్బాయిలను ఇంప్రెస్ చేయడానికే అంటూ స్వాతి దీక్షిత్ చెప్పుకొచ్చింది. వెంటనే కామ్నా జెఠ్మలాని స్పందిస్తూ.. నాది పెళ్లి అయిందంటూ చెప్పుకొచ్చింది. మీది పెళ్లి అయింది.. ఇద్దరు పిల్లల్లున్నారని ఎవరు నమ్ముతున్నారంటూ సుమ కౌంటర్ వేసింది. ఇక ఇషాను అడుగుతూ.. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి.. తెలుగు, పంజాబి, ఢిల్లీ అబ్బాయి అంటూ సుమ ఆప్షన్స్ ఇచ్చింది. అబ్బాయి అయితే చాలు అంటూ సుమకు రివర్స్ కౌంటర్ వేసింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us